Meghlaya Election 2023: నేను కూడా గొడ్డు మాంసం తింటా.. నన్నెవరూ ఆపలేరు.. బీఫ్‌పై బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

బీఫ్‌పై బోల్డ్‌ కామెంట్స్‌ చేశారు మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్‌ మౌరీ. గొడ్డుమాంసం తినకుండా నన్నెవరూ ఆపలేరన్నారు. అవును, నేను బీఫ్‌ తింటా, ఇది మా ఆహార అలవాటు, మా సంస్కృతిలో భాగం అన్నారు.

Meghlaya Election 2023: నేను కూడా గొడ్డు మాంసం తింటా.. నన్నెవరూ ఆపలేరు.. బీఫ్‌పై బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Ernest Mawrie

Updated on: Feb 24, 2023 | 6:45 AM

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయ్‌. అందులో భాగంగానే అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శల్లో భాగంగానే బీఫ్‌ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బీఫ్‌పై బోల్డ్‌ కామెంట్స్‌ చేశారు మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్‌ మౌరీ. గొడ్డుమాంసం తినకుండా నన్నెవరూ ఆపలేరన్నారు. అవును, నేను బీఫ్‌ తింటా, ఇది మా ఆహార అలవాటు, మా సంస్కృతిలో భాగం అన్నారు. బీఫ్‌ తనకుండా తననెవరూ ఆపలేరని, ఈ విషయంలో తన పార్టీ బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. అయినా, బీఫ్‌ తినొద్దని మేఘాలయలో ఎలాంటి ఆంక్షలు లేవుకదా అన్నారు మౌరీ. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి గురించి తమకు అవసరం లేదని… కానీ మేఘాలయలో మాత్రం ప్రజలు తమకు కావాల్సింది తినే స్వే్చ్ఛ ఉందన్నారు. మేఘాలయలో తమ కుటుంబానికీ కబేళా ఉందన్నారు మౌరీ. మేఘాలయలో క్రిస్టియన్లే ఎక్కువగా ఉంటారు, అందరూ చర్చ్‌కి వెళ్తారు, ఇది నిజమే, కానీ బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదన్నారు. బీజేపీని క్రైస్తవ వ్యతిరేక పార్టీగా ప్రొజెక్ట్‌ చేస్తోన్న ప్రతిపక్షాలలపై మండిపడ్డారు మౌరీ.

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి తప్పకుండా మేఘాలయలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధిస్తుందన్నారు మౌరీ. కేంద్రంలో బీజేపీలో అధికారంలోకొచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది, దేశంలో ఎక్కడైనా ఏ చర్చిపైనైనా దాడి జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, బీజేపీ అధికారంలో ఉన్న గోవా, నాగాలాండ్‌లో కూడా చర్చిలపై ఎటాక్స్‌ జరిగిన దాఖలాలే లేవన్నారు. మేఘాలయలో బీజేపీ అధికారంలోకి వచ్చినా అలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు మౌరీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోెసం క్లిక్ చేయండి..