బీఎస్పీ ఛీఫ్ కీలక నిర్ణయం.. వారసుడిని ప్రకటించిన మాయావతి
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ జాతీయ కన్వీనర్‌గా కూడా నియమించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేళ బీఎస్సీ సుప్రీం లీడర్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ జాతీయ కన్వీనర్‌గా కూడా నియమించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేళ బీఎస్సీ సుప్రీం లీడర్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. అంతేకాకుండా ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా కూడా నియమించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాయవాతి జూన్ 23 ఆదివారం నాడు లక్నోలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశ్ ఆనంద్ సహా జాతీయ స్థాయి నేతలతో పాటు, అన్ని రాష్ట్రాలకు చెందిన బీఎస్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
గతంలో కూడా ఆకాశ్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించారు మాయావతి. అయితే ఎన్నికల ముందు అతడిని రెండు హోదాల నుంచి తొలగించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా తాను, కాన్షీరామ్ కలిసి పార్టీని ఏర్పాటు చేసి, అందుకోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశామని మాయావతి ఎన్నికల ముందు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఎస్పీ 424 మంది అభ్యర్థులను బరిలో దించింది. వారిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఈ క్రమంలో.. రెండు హోదాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే, మాయావతి తన మేనల్లుడికి అవే హోదాలను తాజాగా తిరిగి కట్టబెట్టారు. బీఎస్పీలో యూత్‌లీడర్‌గా ఆకాశ్‌కు మంచి పేరుంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తారని బీఎస్పీ నేతలు చెబుతుంటారు. అందుకే మేనల్లుడినే తిరిగి నమ్ముకున్నారు బెహన్‌జీ. పార్టీ పగ్గాలను ఆకాశ్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..