మన్కడింగ్‌పై మళ్లీ అశ్విన్‌కు చురకలు
ఉద్దేశపూర్వకంగా చేసినా ... చేయకపోయినా కొన్ని తప్పిదాలు జీవితాంతం వెంటాడుతుంటాయి.. టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా మన్కడింగ్ వివాదం వెంటాడుతూనే ఉంది..
ఉద్దేశపూర్వకంగా చేసినా … చేయకపోయినా కొన్ని తప్పిదాలు జీవితాంతం వెంటాడుతుంటాయి.. టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా మన్కడింగ్ వివాదం వెంటాడుతూనే ఉంది.. లాస్టియర్ ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ చేసినప్పటి నుంచి అతడిని ఆడిపోసుకుంటున్నారు కొందరు.. ఈ సంఘటన జరిగి ఏడాదిన్నర అవుతుంది.. ఇవాళ కూడా ఈ అంశంపై అశ్విన్‌ను ఎద్దేవా చేశారు కొందరు.. నిన్న రాత్రి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేస్తున్నాడు.. అప్పుడు అదిల్ రషీద్ నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్నాడు.. స్టార్క్ బాల్ విసరక ముందే రషీద్ క్రీజు వదిలి ముందుకెళ్లాడు.. అప్పుడు స్టార్క్ అతడిని హెచ్చరించి వదిలేశాడే తప్ప మన్కడింగ్ చేయలేదు. మ్యాచ్ తర్వాత ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఓ నెటిజన్ అశ్విన్‌ను ఎత్తిపొడుస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.. అదేమిటంటే .. దయచేసి కొంచెం నేర్చుకో అశ్విన్.. ఆటంటే ఇలా ఉండాలి అన్నది ఆ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్‌కు స్పందించిన అశ్విన్ కాస్త ఘాటుగానే జవాబిచ్చాడు.. తాను ధర్మ పోరాటాన్ని నమ్ముతానని, ఇవాళ్టికి తనను వదిలేయమని, తర్వాత మీతో చర్చిస్తానని చెప్పాడు.. పోయిన ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు సారథ్యం వహించిన అశ్విన్ ఈసారి వేలంలో ఢిల్లీ కేపిటల్స్‌కు బదిలీ అయ్యాడు.. ఢిల్లీ కేపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్‌తో మన్కడింగ్ అంశాన్ని అశ్విన్ చర్చించాడట!
క్రికెట్ నియమావళిలో ఇదో వివాదాస్పదమైన రూల్.. రూల్ 41.16 ప్రకారం బౌలర్ బాల్ విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటితే అతడిని అవుట్ చేసే అవకాశం ఈ రూల్ కల్పిస్తుంది.. దీన్ని1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత బౌలర్ వినూ మన్కడ్ వాడాడు. దీంతో.. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ- మెరిలిన్ క్రికెట్ క్లబ్ మన్కడ్ పేరుమీదుగా మన్కడింగ్ నిబంధన చేసింది. అప్పుడు వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆసీస్ ఆటగాడు బిల్ బ్రౌన్ బాల్ వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మన్కడ్ చాలాసార్లు అతడిని హెచ్చరించాడు.. అయినా బ్రౌన్ పట్టించుకోలేదు . దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ వెంటనే అతడిని రనౌట్ చేశాడు. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.