మణిపూర్‌లోని ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో మణిపూర్ హింసా ఘటనలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మరోసారి స్పందించారు. ‘ఏ రాష్ట్రంలోనైనా మహిళలపై అఘాయిత్యాలు క్షమించరానివి. వాటిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మహిళలపై నేరాలు తగ్గించడంపై రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి. అలాగే ఈ విషయంపై చర్చల నుంచి తప్పించుకునే ధోరణి వద్దని ప్రతిపక్షాలను అభ్యర్తిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దు’ అని అనురాగ్ కోరారు.
కాగా మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ అమానవీయ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని నిందితులందరినీ పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు .అలాగే సంబంధిత బాధితులకు న్యాయం చేస్తామని మణిపూర్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మరోవైపు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ కూటమి వర్షాకాల సమావేశాల మొదటి రోజు షెడ్యూల్ చేసిన ఎజెండాను పక్కన పెట్టి మణిపూర్ సమస్యపై చర్చించడానికి వీలుగా అనేక వాయిదా తీర్మానాలను కూడా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించాయి.
#WATCH Delhi: Union Minister Anurag Thakur says, “Atrocities against women in any state is heart-wrenching. It is the state’s responsibility to take charge & reduce crime against women…I would request the opposition not to run away from discussions…The opposition should not… pic.twitter.com/uJeNSr0KnK
— ANI (@ANI) July 23, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..