AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: ఇద్దరు విద్యార్ధుల హత్యతో అట్టుడుకుతున్న మణిపూర్‌.. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్..

మణిపూర్‌లో హింసకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మణిపూర్‌లో ఇద్దరు విద్యార్ధుల హత్యతో మళ్లీ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. రాజధాని ఇంఫాల్‌లో భారీ ఆందోళన చేపట్టారు విద్యార్ధులు. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది.

Manipur Violence: ఇద్దరు విద్యార్ధుల హత్యతో అట్టుడుకుతున్న మణిపూర్‌.. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్..
Manipur
Shaik Madar Saheb
|

Updated on: Sep 27, 2023 | 8:59 AM

Share

మణిపూర్‌లో హింసకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మణిపూర్‌లో ఇద్దరు విద్యార్ధుల హత్యతో మళ్లీ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. రాజధాని ఇంఫాల్‌లో భారీ ఆందోళన చేపట్టారు విద్యార్ధులు. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంఫాల్‌లో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. రబ్బర్‌ బుల్లెట్లు , భాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ విద్యార్ధులను ఆస్పత్రికి తరలించారు. చాలామందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మణిపూర్ హింస సమయంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. వారి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మళ్లీ హింస మొదలైంది. అయితే, విద్యార్థుల మృతి ఘటనపై మణిపూర్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విద్యార్థుల మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. ఇద్దరు విద్యార్థుల మృతిపై మణిపూర్‌ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

ఇద్దరు విద్యార్ధులను కొందరు అటవీ ప్రాంతంలోని ఓ చెట్టు వద్ద బంధించినట్లు ఆ ఫొటోలు, వీడియోల ద్వారా తెలుస్తోంది. వారి వెనుకాల తుపాకులు పట్టుకుని ఉన్నారు కొందరు. ఆ తర్వాత ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు ఉన్నాయి. సాయుధులైన దుండగులు వారిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. విద్యార్జులు కనిపించకుండా పోయి రెండు నెలలు గడుస్తున్నా.. వారి ఆచూకీ కోసం ప్రయత్నించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 6నఆ ఇద్దరు విద్యార్థులు వెళుతున్న దృశ్యాలు పలు సీసీ కెమెరాల్లో రికార్డయినప్పటికీ.. వారి ఆచూకీని కనిపెట్టకపోవడంపై మండిపడుతున్నారు. అయితే, వారిని నిందితులు కిడ్నాప్ చేసి అపహరించి, హత్య చేసినట్లు తెలుస్తోంది. కుకీ మిలీషియానే ఈ దారుణానికి తెగబడిందని మైతీ వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

భట్నాగర్‌ నేతృత్వంలో కొనసాగనున్న విచారణ..

ఈశాన్య రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థుల ‘కిడ్నాప్‌, హత్య’ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ అజయ్‌ భట్నాగర్‌ నేతృత్వంలోని సీబీఐ అధికారుల బృందం బుధవారం ప్రత్యేక విమానంలో ఇంఫాల్‌ చేరుకోనుంది. ఈ కేసును మణిపూర్ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఏజెన్సీలో సెకండ్-ఇన్-కమాండ్ అయిన భట్నాగర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందంలో ఇంఫాల్‌లో క్యాంప్ చేస్తున్న జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ కూడా ఉంటారని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..