మణిపుర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఒక్క రోజే 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనపై మణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ స్పందించారు. వేర్పాటువాదులను ఆయన ఉగ్రవాదులతో పోల్చారు. సాధారణ పౌరులపై వారు ఎమ్-16, ఏకే-47 లాంటి స్నైపర్ గన్లతో దాడులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారని తెలిపారు. అందుకే ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నమని పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్, సెరయు తదితర ప్రాంతాల్లో వేర్పాటువాదులు కాల్పులు చేయడం ప్రారంభించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు చేశారు. పలు వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మణిపుర్‌లో గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తమకు ఎస్టీ హోదా కావాలంటూ మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు మధ్య ఘర్షణకు దారితీసింది. అయితే మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. తాము ఉంటున్న ప్రాంతాలకు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళనలు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..