AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌..! మార్కెట్‌లో సందడి చేస్తున్న ‘నకిలీ మ్యాంగోస్‌’ విషయం ఏంటంటే..!

ఇలాంటివి తిన్నవారి ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడులో ఓ షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ఆహార భద్రతా విభాగం ఒక గిడ్డంగి నుండి నకిలీ మామిడి పండ్లను స్వాధీనం చేసుకుంది. సుమారు ఏడున్నర టన్నుల నకిలీ మామిడిపండ్లను సీజ్‌ చేసిన అధికారులు వాటిని తింటే ఎంత ప్రమాదమో ప్రజలకు వెల్లడించారు. నకిలీ మామిడిపండ్లు అనేగానే అవి యంత్రాల ద్వారా తయారవుతాయని అనుకోవద్దు. దాని అర్థం వేరే ఉంది..

మామిడి ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌..! మార్కెట్‌లో సందడి చేస్తున్న 'నకిలీ మ్యాంగోస్‌' విషయం ఏంటంటే..!
మామిడి రుచి గురించి అందరికీ తెలిసిందే. అయితే మీకు తెలుసా? మామిడి పండు మాత్రమే కాదు, మామిడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయట. మామిడి పండు తిన్న తర్వాత టెంక పడేడయటం మనందరికీ అలవాటే. కానీ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుల ప్రకారం.. మామిడి గింజలను సమర్థవంతమైన మూలికా ఔషధంగా పరిగణిస్తారు.
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2024 | 8:24 PM

Share

Calcium Carbide Mangoes: మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడవుతున్న మామిడి పండ్లను బండ్లపై చూడగానే మామిడిప్రియులు ఎగబడుతుంటారు. కానీ, అందులో అసలు ఏవి, నకిలీ ఏవి అనేది పట్టించుకోరు. అదేంటి మామిడి పండ్లలో నకిలీ అనే సందేహం కలుగుతుంది కదూ..! కానీ, మీరు విన్నది నిజమే.. మార్కెట్లో చాలా నకిలీ మామిడి పండ్లు వస్తున్నాయి. ఇలాంటివి తిన్నవారి ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడులో ఓ షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ఆహార భద్రతా విభాగం ఒక గిడ్డంగి నుండి నకిలీ మామిడి పండ్లను స్వాధీనం చేసుకుంది. సుమారు ఏడున్నర టన్నుల నకిలీ మామిడిపండ్లను సీజ్‌ చేసిన అధికారులు వాటిని తింటే ఎంత ప్రమాదమో ప్రజలకు వెల్లడించారు.

నకిలీ మామిడిపండ్లు అనేగానే అవి యంత్రాల ద్వారా తయారవుతాయని అనుకోవద్దు. దాని అర్థం వేరే ఉంది.. ఈ మామిడి పండ్లను చెట్ల నుండి తీసి, కృత్రిమంగా త్వరగా పండించి మార్కెట్‌కు తరలిస్తారు. అందుకే వీటిని నకిలీ మామిడి అని పిలుస్తారు. ఈ నకిలీ మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తారు. అయితే దాని ఉపయోగం పూర్తిగా నిషేధించబడింది. ఎందుకంటే దాని సహాయంతో వండిన పండ్లు మానవ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఎవరైనా కాల్షియం కార్బైడ్‌తో మక్కబెట్టిన మామిడి పండ్లను తింటే అది వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

కాల్షియం కార్బైడ్ మార్కెట్‌లో సులువుగా దొరుకుతుంది. ఇది ఒక రకమైన రాయిలా ఉంటుంది. అందుకే ప్రజలు దీనిని సున్నపురాయి అని కూడా పిలుస్తారు. కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను పండించడానికి, కార్బైడ్‌ను పచ్చి మామిడికాయల మధ్య ఒక కట్టలో ఉంచుతారు. మామిడికాయల బుట్టలో క్యాల్షియం కార్బైడ్ చుట్టూ మామిడికాయలను ఉంచి, ఆపై దానిని గోనె సంచులతో కప్పేస్తారు. ఈ మామిడి పండ్లను 3-4 రోజులు గాలిలేని ప్రదేశంలో ఉంచుతారు. దాని కారణంగా అవి పండిపోతాయి.. కాల్షియం కార్బైడ్‌ను తేమతో సంబంధం లేకుండా ఎసిటిలీన్ వాయువు ఏర్పడుతుంది. ఏ రకమైన పండు అయినా దీంతో ఈజీగా పండుతుంది.

ఇవి కూడా చదవండి

ఇలా కాల్షియం కార్బైడ్‌తో వండిన మామిడి పండ్లను తీసుకోవడం ప్రజలకు చాలా ప్రమాదకరం. దీన్ని తీసుకోవడం వల్ల కడుపునొప్పి నుంచి విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాదు, తలనొప్పి, మానసిక ఆందోళన, తల తిరగడం, మూర్ఛలతో కూడా బాధపడే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల  కోసం క్లిక్ చేయండి..