Road safety push: ద్విచక్ర వాహనదారులకు కేంద్రం హెచ్చరిక.. భద్రత కోసం ఇకపై వాటిని మాత్రమే వాడాలి!
పోలీసులు చలాన్ వేయకుండా ఏదో రోడ్డు పక్కన రూ.100- 200 దొరికే హెల్మెట్ కొని.. దాన్ని పెట్టుకొని కాలం గడిపేస్తున్నారా.. అయితే జాగ్రత్త ఇకపై మీరు అలా చేస్తామంటే కుదరడు.. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ధారించిన ISI హెల్మెట్లను మాత్రమే ఇకపై మీరు వాడాలి. ఇదే విషయాన్ని స్పష్టం చేసింది కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు భద్రత కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫైడ్ హెల్మెట్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.

మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అయినప్పటికీ.. దాని ప్రభావం ధరించే హెల్మెట్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రామాణికం కాని హెల్మెట్‌లు రక్షణను ప్రమాదంలో పడేస్తాయి.. హెల్మెట్ ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి. దీనిని పరిష్కరించడానికి 2021 నుండి హెల్మెట్‌ల నాణ్యత నియంత్రణ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. అన్ని ద్విచక్ర వాహనదారులకు BIS ప్రమాణాల (IS 4151:2015) కింద ధృవీకరించబడిన ISI-మార్క్ ఉన్న హెల్మెట్‌లను మాత్రమే ధరించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.
జూన్ 2025 నాటికి, భారతదేశం అంతటా 176 మంది తయారీదారులు రక్షిత హెల్మెట్‌ల కోసం చెల్లుబాటు అయ్యే BIS లైసెన్స్‌లను కలిగి ఉన్నారు. అయితే రోడ్ల పక్కన విక్రయించే అనేక హెల్మెట్‌లకు తప్పనిసరి BIS సర్టిఫికేషన్ లేదని, దీనివల్ల ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు అక్కడికక్కడే మరణిస్తున్నారని వినియోగదారుల వ్యవహారాల శాఖ గుర్తించింది. అందువల్ల హెల్మెట్ల నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడానికి, BIS క్రమం తప్పకుండా ఫ్యాక్టరీ మార్కెట్‌పై నిఘా నిర్వహిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో, BIS స్టాండర్డ్ మార్క్ దుర్వినియోగం అవుతుండటంతో 500 కి పైగా హెల్మెట్ నమూనాలను పరీక్షించిన బీఎస్‌ఐ.. 30 కి పైగా సెర్చ్ సీజ్ ఆపరేషన్లు జరిపింది. ఢిల్లీలో చేపట్టిన ఆపరేషన్‌లో, గడువు ముగిసిన, రద్దు చేయబడిన లైసెన్స్‌లతో హెల్మెట్స్ తయారీ చేస్తున్న తొమ్మిది సంస్థల నుండి 2,500 కి పైగా నాన్-కాంప్లైంట్ హెల్మెట్‌లను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా రోడ్డుపక్కన, షాప్‌లలో నాసిరకం హెల్మెట్స్ అమ్ముతున్న వారిపై కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ద్విచక్ర వాహన దారుల భద్రత కోసం చర్యలు..
వినియోగదారుల రక్షణ,రహదారి భద్రత కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ పనిచేస్తుంది. మార్కెట్ నుండి నాసిరకం హెల్మెట్‌లను తొలగించడం ద్వారా రోడ్డు ప్రమాద మరణాలను నివారించడం ,అధిక-నాణ్యత గల హెల్మెట్లు వాహనదారులకు అందుబాటులో ఉండేలా చూడడం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చేస్తుంది. రహదారి భద్రతను పెంపొందించడానికి, నాసిరకం హెల్మెట్ల నుండి వినియోగదారులను రక్షించడానికి, వినియోగదారుల వ్యవహారాల శాఖ దేశంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లుకు లేఖ రాసింది, ద్విచక్ర వాహనదారులకు నిబంధనలకు అనుగుణంగా లేని హెల్మెట్లను విక్రయించే తయారీదారులు, రిటైలర్లను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించాలని కోరింది.
ఈ విషయంలో వ్యక్తిగతంగా ఆసక్తి చూపాలని నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల అమలును నిర్ధారించడానికి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించాలని, ప్రస్తుత రహదారి భద్రతా ప్రచారాలతో డ్రైవ్‌ను అనుసంధానించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ జిల్లా అధికారులను కోరింది. ఈ ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి జిల్లా అధికారులతో పాటు పోలీసులు ప్రచారంలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులకు సౌకర్యవంతమైన BIS హెల్మెట్‌ను అందించేందుకు తయారీదారు లైసెన్స్ పొంది ఉన్నారా లేదా అని తనిఖీ చేయడానికి BIS కేర్ యాప్ , BIS పోర్టల్‌లో ఒక నిబంధనను జోడించింది. వినియోగదారులు BIS కేర్ యాప్‌పై ఫిర్యాదు చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వినియోగదారుల అవగాహన చొరవలో భాగంగా, BIS క్వాలిటీ కనెక్ట్ ప్రచారాన్ని నిర్వహిస్తుంది.
కేంద్రం ఎన్ని ప్రచారాలు నిర్వహించినా వాహనం నడిపేవారు భద్రతా ప్రమాణాలు గల హెల్మెట్ వాడటం తప్పనిసరి. పోలీసులు చలాన్ వేస్తారని.. ఏదో ఒకటి హెల్మెటే కదా అని.. రోడ్డు పక్కన దొరికే నాణ్యత లేని, సర్టిఫైడ్ కాని హెల్మెట్ కొన్నారనుకో.. మీ ప్రాణాలను మీరే రిస్క్ లో పెట్టుకున్న వారు అవుతారు. సో పోలే పోయింది. డబ్బులు పెట్టి మంచి ISI మార్క్ ఉన్న హెల్మెట్ కొని వాడండి. అని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.