ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వచ్చిన బెదిరింపు కాల్ కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. గంటల వ్యవధిలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ముండ్కా నివాసి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి పేరు జై ప్రకాష్ అని చెప్పారు. ఆ వ్యక్తి అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసి కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరించాడు. నిందితుడి మానసిక స్థితి బాగోలేక వైద్య చికిత్స పొందుతున్నట్టుగా చెప్పారు.
సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు పీసీఆర్ కాల్ చేసి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని నిందితులు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కాల్ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి అతడిని గుర్తించారు. నిందితుడికి ఢిల్లీలోని గులాబీ బాగ్‌లో చికిత్స కొనసాగుతున్నందున పోలీసులు అతన్ని అరెస్టు చేయలేదని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..