AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమిపై ఎలియెన్స్ దాడి తప్పదా..? UK నిపుణులహెచ్చరిక ఏం చెబుతోంది..

గ్రహాంతరవాసుల రూపాన్ని సినిమాలు,టీవీల్లో చూసిన వాటితో సమానంగా కనిపిస్తాయని చెప్పారు. వాటి ఎత్తు 3 నుండి 5 అడుగుల వరకు ఉంటుందన్నారు. . వారి చర్మం రంగు నీలం, బూడిద రంగులో ఉంటుందన్నారు. వారి తల పెద్దదిగా ఉండి, పియర్ ఆకారంలో ఉంటుందన్నారు.

భూమిపై ఎలియెన్స్ దాడి తప్పదా..? UK నిపుణులహెచ్చరిక ఏం చెబుతోంది..
Alien
Jyothi Gadda
|

Updated on: Jan 31, 2023 | 10:44 AM

Share

ఒక ప్రముఖ UFO నిపుణుడు UK సీనియర్ మాల్కం రాబిన్సన్ గ్రహాంతర వీక్షణల గురించి 45 సంవత్సరాలు పరిశోధించిన తర్వాత వారి గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. గ్రహాంతరవాసులు శాంతిని ఏ మాత్రం సహించరని, వారి ద్వారా విధ్వంసమే జరుగుతుందని హెచ్చరించారు . 45 ఏళ్ల కెరీర్‌లో డజన్ల కొద్దీ వీక్షణలను పరిశోధించిన ప్రముఖ UFO నిపుణుడు మాల్కం రాబిన్సన్ గ్రహాంతరవాసులపై 10 పుస్తకాలు రాశారు. UK సీనియర్ UFO నిపుణుడు మాల్కం రాబిన్సన్ గ్రహాంతరవాసులు శాంతిని అస్సలు ఇష్టపడరని పేర్కొన్నారు. తన 45 ఏళ్ల పరిశోధన ఆధారంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అతను గ్రహాంతరవాసుల గురించి 10 కంటే ఎక్కువ పుస్తకాలు రాశాడు. డజన్ల కొద్దీ గ్రహాంతర సంఘటనలను పరిశోధించాడు. అతను గత కొన్ని దశాబ్దాలుగా UFO లకు సంబంధించిన పరిశోధనలు చేస్తూ వివిధ రకాల సమాచారాన్ని సేకరిస్తున్నాడు. గ్రహాంతరవాసుల గురించి ఇంకా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయని రాబిన్సన్ చెప్పారు.

ఈ మేరకు రాబిన్సన్ వివరిస్తూ.. UFO వీక్షణలలో ఎక్కువ భాగాన్ని సహజ వాస్తవంగా వివరించవచ్చునని చెప్పారు. గ్రహాంతరవాసుల గురించి మనకు చాలా తక్కువ తెలుసునని చెప్పారు. అది కూడా ఒక శాతం మాత్రమే అన్నారు. తన సహోద్యోగులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. UFO మిస్టరీ నిజమేననడంలో సందేహం లేదన్నారు.

యూఎఫ్ఓ నిపుణుడు మాల్కం రాబిన్సన్ మాట్లాడుతూ.. మనం ఏలియన్స్‌ను పాత చిత్రాలుగా, వింత ఆకారాలుగా చూస్తుంటాం. మానవులమైన మన నుండి గ్రహాంతరవాసులు ఏమి కోరుకుంటున్నారని అడిగినప్పుడు, రాబిన్సన్ ఇలా సమాధానమిచ్చాడు, “గ్రహాంతరవాసులకు ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంది, మేము దానిని ఊహించగలము. ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతరవాసుల ద్వారా వేల సంఖ్యలో అపహరణలు జరిగాయని నేను నమ్ముతున్నాను.” , ఇది సరైనది కాదు. గ్రహంతరవాసులు శాంతిని అస్సలు ఇష్టపడరని తాను నమ్ముతున్నాను అని చెప్పారు. రాబిన్సన్ 20 సంవత్సరాల వయస్సులో UFOs, గ్రహాంతరవాసుల గురించి పరిశోధన చేయడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

స్కాట్లాండ్, UFO, పారానార్మల్ యాక్టివిటీ సొసైటీ స్థాపకుడు రాబిన్సన్, గ్రహాంతరవాసుల రూపాన్ని గురించి వివరించారు. సినిమాలు, టీవీల్లో చూసిన వాటితో సమానంగా ఇవి కనిపిస్తాయని చెప్పారు. వాటి ఎత్తు 3 నుండి 5 అడుగుల వరకు ఉంటుంది. వారి చర్మం రంగు నీలం, బూడిద రంగులో ఉంటుంది. వారి తల పెద్దది. పియర్ ఆకారంలో ఉంటుంది. అయితే వారి కళ్ళ చుట్టూ లోతైన నల్లటి పాచ్ ఉంటుంది. రాబిన్సన్ గ్రహాంతరవాసుల అంశంపై బెస్ట్ సెల్లర్ పుస్తకాన్ని కూడా రాశారు.