Crime News: పెళ్లయిన మరునాడే ఘోరం.. వధువు లవర్.. వరుడిని ఏం చేశాడంటే..?

|

Aug 17, 2022 | 8:08 PM

ఆగస్టు 15న పెళ్లి కాగా.. ఆ మరునాడే నిందితుడు తన ప్రియురాలి భర్తను కిరాతకంగా చంపినట్లు రాజ్‌కోట్ రూరల్ పోలీసులు తెలిపారు.

Crime News: పెళ్లయిన మరునాడే ఘోరం.. వధువు లవర్.. వరుడిని ఏం చేశాడంటే..?
Crime News
Follow us on

Man Stabbed to Death by Wife’s Paramour: వారిద్దరి ఇష్టం ప్రకారమే వారి పెళ్లి జరిగింది. కానీ, వధువు ప్రియుడికి మాత్రం నచ్చలేదు. దీంతో పెళ్లైన మరుసటి రోజే కొత్త జంట ఇంటికి వెళ్లిన దుర్మార్గుడు.. వరుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. ఆగస్టు 15న పెళ్లి కాగా.. ఆ మరునాడే నిందితుడు తన ప్రియురాలి భర్తను కిరాతకంగా చంపినట్లు రాజ్‌కోట్ రూరల్ పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడు యశ్వంత్ మక్వానా కోసం గాలిస్తున్నామని డీఎస్పీ పీఏ జాలా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కమలేష్ చావ్డాకు అంతకుముందు వివాహం జరిగింది. అతనికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అతను మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఈ సమయంలో కోమల్‌ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. కానీ కోమల్ యశ్వంత్ మక్వానా అనే యువకుడితో డేటింగ్ చేస్తోంది. చాలా కాలంపాటు మక్వానాతో సహజీవనం చేసిన కోమల్.. పెళ్లికి కేవలం రెండు నెలల ముందు ఇంటికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో కమలేష్ చావ్డా, కోమల్‌ వివాహం నిశ్చయమైంది.

వీరిద్దరూ ఆగస్టు 15న వివాహం చేసుకున్నారు. పెళ్లి గురించి తెలుసుకున్న మక్వానా.. ఆగస్ట్ 16 రాత్రి కమలేష్ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. కత్తితో పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం కుటుంబసభ్యులు కమలేష్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కమలేష్ చావ్డా సోదరుడు వినోద్ చావ్డా.. ఫిర్యాదు మేరకు అత్కోట్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..