Watch Video: ఏంటి బ్రో మరీ ఇంతవైలెంట్‌గా ఉన్నావ్.. కోపంలో బైక్‌ను భుజానేసుకొని వెళ్లిన వ్యక్తి .. అసలు ఏం జరిగిందంటే?
సాధారణంగా మనం ఎక్కడికైన వెళ్తున్న క్రమంలో రైల్వేగేట్ పడితే ఏం చేస్తాం.. రైలు వెళ్లేంత వరకైనా వేచిఉంటాం, లేదా ట్రైన్ రాక ముందే మన బైక్‌ను వంపుకొని గేటు కిందనుంచైనా అవతలవైపునకు దాటి వెళ్తాం.. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఈ రెండింటికి బిన్నంగా ఏకంగా తన బైక్‌ను ఎత్తుకొని నడుచుకుంటూ ట్రాక్ దాటి వెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడున్న వాహనదారులంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

రైల్వే ట్రాక్ వద్ద వేచి ఉండి సహనం కోల్పోయిన ఒక వ్యక్తి తన బైక్‌ను భూజాలపై ఎత్తుకొని క్రాసింగ్‌కు ఎదురుగా నడుస్తున్నట్లు చూపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే .. ఒక వ్యక్తి తన బైక్‌పై వెళ్తుండగా సడెన్‌గా రైల్వే గేటు పడింది. దీంతో అందరి ప్రయాణికులతో పాటు అతను కూడా రైల్వే క్రాసింగ్ వద్ద ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే ఎంతసేపటికీ ట్రైన్ రాకపోవడంతో సహయం కోల్పోయిన వ్యక్తి ఎలాగైనా ట్రాక్ దాటి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది చూడ్డానికి బాడీ బిల్డర్‌లా ఉన్న అతను తన 100 కేజీలకు కంటే ఎక్కువ బరువున్న బైక్‌ను ఈజీగా తన భుజాలపైకి ఎత్తుకొని రోడ్డు అవతలి వైపుకు తీసుకెళ్లాడు.
అంత బరువు మోస్తున్నప్పటికీ అతని మోహంలో ఎలాంటి ఇబ్బంది కనిపించక పోగా.. ఇంతసేపు వెయిట్ చేయాలనే అహసనం అతని ముఖంలో కనిపించింది. ప్రజలు తమ వస్తువులను మోయడానికి కూడా ఇబ్బంది పడుతున్న చోట, ఈ వ్యక్తి మొత్తం ద్విచక్ర వాహనాన్ని ఎత్తి తన భుజాలపై మోయడం అందరరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అక్కడున్న ప్రజలందూ అతన్ని “బాహుబలి” అంటూ పొడిగారు. మరికొందరు మాత్రం దాని వల్ల అతను భుజాల సమస్య ఎదుర్కొవచ్చని విమర్శించారు.
ఈ దృశ్యాలను మొత్తం అక్కడున్న స్థానిక వాహనదారులు తమ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఒక బాహుబలి అంటూ పొగడగా.. మరికొందరు కాసేపు ఆగితే ఈజీగా వెళ్లిపోవచ్చుకదా.. అంటూ కామెంట్స్ చేశారు.
వీడియో చూడండి..
रेलवे क्रॉसिंग की ऐसी की तैसी…..!!!
हम जहाँ खड़े होते है….. लाइन वहीं से शुरू होती है…!! pic.twitter.com/ZoibSNgyqW
— kapil bishnoi (@Kapil_Jyani_) August 17, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
