AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైంగిక చర్యను ప్రతిఘటించిందని.. దారుణంగా హత్య చేసి.. మృతదేహంతో సెక్స్

మహిళలు, యువతులపై ఆకృత్యాలు, దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతి నిమిషం దేశంలో ఏదో ఓ చోట అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి...

లైంగిక చర్యను ప్రతిఘటించిందని.. దారుణంగా హత్య చేసి.. మృతదేహంతో సెక్స్
Ganesh Mudavath
|

Updated on: Feb 23, 2022 | 7:18 AM

Share

మహిళలు, యువతులపై ఆకృత్యాలు, దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతి నిమిషం దేశంలో ఏదో ఓ చోట అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుద్ధలు మృతదేహాలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో వారిని దారుణంగా హత్య చేసి, శవం పై తమ కోరికను తీర్చుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఇలాంటి దుర్ఘటనే జరిగింది. తన భార్య స్నేహితురాలు.. లైంగిక చర్యను ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా హత్య(Murder) చేశాడు. అనంతరం మృతదేహంపైనే తన వాంఛ తీర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను చంపిన అనంతరం నిందితుడు అమన్​సింగ్​ బిష్ఠ్.. ఆ మృతదేహంపై అత్యాచారం చేసినట్లు తేల్చారు. అమన్ ను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. యువతితో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించిందని, అందుకే చంపేసి లైంగిక చర్యకు పాల్పడినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అయితే మృతురాలు తన భార్య స్నేహితురాలేనని తెలిపాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 19న అమన్ భార్య కాశిక్​ ఎన్​క్లేవ్​లోని తన ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె స్నేహితురాలు అర్ధనగ్నంగా పడి ఉండటాన్ని గమనించింది. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమన్ భర్తను అనుమానితుడిగా భావించి, సోమవారం అరెస్టు చేశారు.

Also Read

AP CRIME: ఆటో బోల్తా.. ఇద్దరు మృతి.. పోలీసుల బెదిరింపులే కారణమా..

Covid: బిల్ గేట్స్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టింది.. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సంచలన ప్రకటన..

IND vs SL: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. గాయంతో దూరమైన స్టార్ ఆల్ రౌండర్..