Uttar Pradesh: ఘోర ఘటన..! భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఘోర ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా బన్స్‌దిహ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామసభ దేవ్‌డిహ్‌లో వెలుగు చూసింది. ట్రిపుల్ మర్డర్, ఆత్మహత్య సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా బన్స్‌దిహ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని..

Uttar Pradesh: ఘోర ఘటన..! భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్య
Husband Kills Wife

Updated on: Dec 11, 2023 | 5:29 PM

బల్లియా, డిసెంబర్‌ 11: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఘోర ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా బన్స్‌దిహ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామసభ దేవ్‌డిహ్‌లో వెలుగు చూసింది. ట్రిపుల్ మర్డర్, ఆత్మహత్య సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా బన్స్‌దిహ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామసభ దేవ్‌డిహ్‌లో తోటలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు కనిపించాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారి గొంతులు పదునైన ఆయుధంతో కోసి చంపినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు వేలాడుతూ ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు దేవ్‌డిహ్‌కు చెందిన మోహన్‌రామ్‌ కుమారుడు శ్రవణ్‌రామ్‌గా గుర్తించారు. అతని భార్య శశికళాదేవి (35), ఇద్దరు పిల్లలను ఇంటి సమీపంలోని మామిడితోటలో పదునైన ఆయుధంతో హత్య చేసి, ఆపై మోహన్‌రామ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడే ముందు మృతుడు సూసైడ్ నోట్‌ కూడా రాశాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆవేశానికి లోనైన భర్త తన భార్య, పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆదివారం రాత్రి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు శశికళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శశికళ భర్త మోహన్‌రామ్‌ భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించేవాడని, చిన్న చిన్న విషయాలకే ఆమెను కిరాతకంగా కొట్టేవాడని మేనమామ పోలీసులకు తెలిపాడు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ బల్లియా, ఎస్ ఆనంద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.