Dharmendra Pradhan: సుప్రీంకోర్టు తీర్పు.. ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి కొత్త శక్తినిస్తుంది..

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని స్పష్టంచేశారు. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని.. మిగతా రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక తేడాలేవీ లేవు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

Dharmendra Pradhan: సుప్రీంకోర్టు తీర్పు.. ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి కొత్త శక్తినిస్తుంది..
Union Minister Dharmendra Pradhan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2023 | 5:35 PM

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని స్పష్టంచేశారు. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని.. మిగతా రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక తేడాలేవీ లేవు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు.. ఆర్టికల్ 370 రద్దు విషయంలో జోక్యం చేసుకోలేమని.. రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు నిచ్చింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టి.. తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. జమ్ము కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అంటూ వెల్లడించింది. జమ్ము కశ్మీర్ రాజు నాడు దీనిపై ఒప్పందం చేసుకున్నారని వివరించింది. ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్లో యుద్ధవాతావరణాన్ని సృష్టించిందని, కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదంటూ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే రాష్ట్రపతి అధికారాలను ప్రతిసారి న్యాయపరిశీలనకు తీసుకోవడం సాధ్యంకాదని సీజేఐ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని ధర్మాసనం సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని.. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది.

కాగా.. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి గౌరవనీయమైన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నాను.. అభినందిస్తున్నాను.. అంటూ ఎక్స్ లో షేర్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రజల కలలు, ఆకాంక్షలను సాకారం చేయడానికి కొత్త శక్తిని జోడిస్తుంది. ఇది ప్రధానమంత్రి నేతృత్వంలోని పార్లమెంటు చారిత్రాత్మక నిర్ణయం.. రాజ్యాంగ అమలుకు కూడా ఆమోదం… ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కి కొత్త ఉదయాన్ని తీసుకురావాలనే సంకల్పం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు.

ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..