ఒడిశా జాజ్‌పూర్ జిల్లాలోని నగాడా గ్రామంలో పోషకాహార లోపం కారణంగా 2016లో జువాంగా తెగకు చెందిన 20 మంది శిశువులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత రాష్ట్రంలో పోషకాహార లోపం కారణంగా మరో మరణం నమోదుకావడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్‌గా మారిన హృదయ విదారక వీడియోలో ఒక తల్లి తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్న తన బిడ్డతో కూర్చుని ఉంది. అయితే కుటుంబంలోని పేదరికం చిన్నారి మృతికి కారణమైందని పేర్కొంటున్నారు.
అయితే, ఈ వీడియోలో ఓ మూలన వేరుశెనగలు తింటూ తోబుట్టువుల పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితిలో మరో చిన్నారి కనిపిస్తోంది. తల్లి.. పిల్లలిద్దరినీ నిస్సహాయంగా చూస్తూ కన్నీరుపెడుతోంది. ఆమె, తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి చెబుతూ కన్నీరుమున్నీరవుతోంది.
VIDEO | Heart-wrenching scene of Malnutrition affected kids, including death reports, surface in Odisha’s mines-rich Jajpur District. A family’s abject poverty led to a child’s death due to malnutrition. One of the daughters in the family is bedridden because of malnutrition. pic.twitter.com/mopt4LBeV5
— Press Trust of India (@PTI_News) March 24, 2023
మీడియాల కథనాల ప్రకారం.. ఈ వీడియో జాజ్‌పూర్ జిల్లా దానగడి బ్లాక్‌లోని రణగుండి పంచాయతీలోని ఘటిసాహి గ్రామానికి చెందినది. పౌష్టికాహార లోపంతో తన మొదటి బిడ్డ చనిపోయిందని.. ఇలాంటి పరిస్థితిలో రెండో రెండో బిడ్డ గురించి ఆందోళన చెందుతూ మహిళ కనిపించింది. అయితే, పోషకాహార లోపంతో మహిళ మంచాన పడిందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఒడిశా ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రతిపాదించి, సంక్షేమ పథకాలను ప్రకటించిన తర్వాత కూడా పోషకాహార లోపంతో ఇటీవల ఒక చిన్న పిల్లవాడు మరణించడం.. మరొకరి మనుగడ కోసం తల్లి పోరాడుతుండటం ప్రస్తుతం కంటనీరు పెట్టిస్తోంది.కూతురి పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్న తల్లి.. తన కూతురు నడవలేపోతుందని, కూర్చోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోందని చెప్పింది.
“ఆమె నడవలేకపోతుంది, కూర్చోలేకపోతోంది. ఆమె మంచాన పడింది. పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణిస్తోంది” అంటూ ఆమె చెప్పింది. బంకు హెంబ్రామ్ తన భార్య తులసి హేంబ్రామ్ దంపతులు.. తొమ్మిది మంది పిల్లలతో కలిసి గ్రామంలో నివసిస్తున్నారని స్థానిక వర్గాలు తెలిపాయి.
VIDEO | Heart-wrenching scene of Malnutrition affected kids, including death reports, surface in Odisha’s mines-rich Jajpur District. A family’s abject poverty led to a child’s death due to malnutrition. One of the daughters in the family is bedridden because of malnutrition. pic.twitter.com/mopt4LBeV5
— Press Trust of India (@PTI_News) March 24, 2023
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించినా ఎవరూ ముందుకు రాలేదు. మిగతా పిల్లలు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారికి రేషన్‌కార్డు ఉందని, అయితే రేషన్ ద్వారా కుటుంబం కొంత గట్టెక్కుతుందని.. పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు అందించకపోవడంతో నీరు బియ్యం, ఉప్పుతోనే కుటుంబం బతుకుతుందని పేర్కొంది.
నివేదికల ప్రకారం, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు (DCPO) బృందంతో గ్రామాన్ని సందర్శించి పిల్లలందరినీ రక్షించారు. పిల్లలంతా ప్రస్తుతం సుకింద ప్రాంతంలో పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
VIDEO | Heart-wrenching scene of Malnutrition affected kids, including death reports, surface in Odisha’s mines-rich Jajpur District. A family’s abject poverty led to a child’s death due to malnutrition. One of the daughters in the family is bedridden because of malnutrition. pic.twitter.com/mopt4LBeV5
— Press Trust of India (@PTI_News) March 24, 2023
‘‘మాకు న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ (NRC) ఉంది, ఒక కౌన్సిలర్, థెరపిస్ట్, పీడియాట్రిక్ స్పెషలిస్ట్ ఇప్పుడు పిల్లలని పర్యవేక్షిస్తున్నారు. మరో చిన్నారిని అంతకుముందు డీహెచ్‌హెచ్‌లో చేర్చారు. కానీ, పౌష్టికాహారలోపం గురించి తెలియని ప్రజలు ఆసుపత్రికి రావడానికి ఇష్టపడరు. కాబట్టి, మేము త్వరలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి.. పోషకాహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాము, ”అని జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO), సిబాశిష్ మహారాణా తెలిపారు.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వీడియోపై ముఖ్య కార్యదర్శి, చీఫ్ డెవలప్‌మెంట్ కమిషనర్ స్పందిస్తూ ఈ విషయాన్ని పరిశీలించి కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు.
“It’s a shame that in 2023, children are still dying from malnutrition. We have the resources and the technology to prevent this. We need to take action now.”
— Rudra@ରୁଦ୍ରନାରାୟଣ ଦାସ (@rudranarayandas) March 24, 2023
కాగా, 2023లో కూడా పోషకాహార లోపంతో చిన్నారులు చనిపోవడం సిగ్గుచేటని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు.
Even after 75 years of independence, if we can’t provide basics like food, water, education, house and health to our citizens, then we need some deep introspection on what have we achieved yet as a nation?
— Unbiased Defenestrator (@Dontpushyourluk) March 24, 2023
మరొకరు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా, భారతదేశం ఆహారం నీరు, విద్య, ఆరోగ్యం వంటి కనీస సౌకర్యాలను అందించలేకపోయింది.. అంటూ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..