పాపం భార్యామణి.. ప్రియుడి కోసం ఏదో చేద్దామనుకుంటే మరోదే జరిగింది.. జైల్లో ఊచలు లెక్కిస్తోంది..

|

Mar 08, 2023 | 2:30 PM

పచ్చటి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి అక్రమ సంబంధాలు. కలకాలం కలిసి మెలిసి జీవించాల్సి దంపతులు.. పక్క చూపుల కారణంగా ఏడబాటవుతున్నారు. ఈ అక్రమ సంబంధాల విషయంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా..

పాపం భార్యామణి.. ప్రియుడి కోసం ఏదో చేద్దామనుకుంటే మరోదే జరిగింది.. జైల్లో ఊచలు లెక్కిస్తోంది..
Arrest
Follow us on

పచ్చటి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి అక్రమ సంబంధాలు. కలకాలం కలిసి మెలిసి జీవించాల్సి దంపతులు.. పక్క చూపుల కారణంగా ఏడబాటవుతున్నారు. ఈ అక్రమ సంబంధాల విషయంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు జైలుపాలవుతున్నారు. మొత్తంగా వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో వెలుగు చూసిన అఫైర్స్‌కి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సంచలనం రేపుతోంది.

ప్రియుడితో కలిపి పారిపోవడానికి భర్త నుంచి రూ. 8 లక్షల విలువైన బంగారం, నగదును అపహరించింది ఓ భార్య. కానీ, కథ అడ్డం తిరిగింది. పోలీసులకు అడ్డంగా దోరికిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జ్యోతిరామ్ షెడ్గే – పాయల్ జ్యోతిరామ్ షెడ్గే దంపతులు. వీరు మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే, పాయల్‌కు మరో వ్యక్తితో ప్రేమలో పడింది. తన ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది. ఈ క్రమంలోనే.. తన భర్త సాంగ్లీ పర్యటనకు ప్లాన్ చేశాడు. అందుకోసం సిద్ధం కావాలని భార్యను ఆదేశించాడు.

భర్త జ్యోతిరామ్ షెడ్గే కారు కోసం బయటకు వెళ్లగా.. భార్య పాయల్ ఇంట్లో లగేజ్ సర్దిపెట్టింది. ఆ లగేజ్ తీసుకుని నేరుగా జ్యోతిరామ్ వద్దకు వెళ్లింది. అలా ఇద్దరూ కలిసి సాంగ్లీకి వెళ్లారు. ఇద్దరూ తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు గడియ పగులగొట్టి ఉంది. లాకర్‌లో పెట్టిన నగదుతో పాటు, రూ. 8 లక్షల విలువైన ఆభరణాలు కనిపించలేదు. దాంతో జ్యోతిరామ్ షెడ్గే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భార్య పాయలే ఈ చోరీకి పాల్పడినట్లు తేల్చారు. చోరీ నగదు, నగలను తన ప్రియుడికి ఇచ్చిందని గుర్తించారు పోలీసులు. ఆ తరువాత పాయల్ తన ప్రియుడితో వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యిందని గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆమెపై అనుమానం రాకుండా, చాలా జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. మొత్తంగా పాయల్ మాస్టర్ ప్లాన్‌కు చెక్ పెట్టిన పోలీసులు.. ఆమెపై కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..