సినిమా లెవెల్ సీన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ఏం చేశారో తెలిస్తే..
మహారాష్ట్రలోని దారుణ ఘటన వెలుగు చూసింది. 28 ఏళ్ల ఒక వివాహిత మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఇంట్లోనే గొయ్యి తొవ్వి టైల్స్ కింద పాతిపెట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

రోజురోజుకు మానవసంబంధాలు మంటకలుస్తున్నాయి. పరాయి వ్యక్తి మోజులో పడిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను కడతేర్చుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటన మరీ విపరీతంగా పెరిగిపోయాయి. కనీసం రోజుకు రెండు మూడు ఘటనలైన ఇలాంటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ఒక వివాహితన తన ప్రియుడితో కలిసి భర్తను సినిమా లెవెల్‌లో హత్య చేసిన ఆ తర్వాత అతన్ని ఇంట్లోని టైల్స్ కింద పూడ్చిపెట్టినట్టు కొన్ని జాతీయ కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన మహారాష్ట్రాలోని పాల్ఘర్ జిల్లా నలసోపర ప్రాంతంలో వెలుగు చూసింది. బాధితుడి సోదరుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టి..
పోలీసులు తెలిపిన కథనం ప్రకరాం.. నలసోపర ప్రాంతానికి చెందిన విజయ్ చవాన్ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం కోమల్ అనే యువతితో వివాహం జరిగింది. వీళ్లకు ప్రస్తుతం ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కోమల్ చవాన్‌కు స్థానికంగా ఉండే మోను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు కలిసి ఉండాలంటే తన భర్త అడ్డంగా ఉన్నాడని గ్రహించిన కోమల్ ప్రియుడు మోనుతో కలిసి అతిని హత్యకు ప్లాన్ చేసి.. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ఇంట్లోనే టైల్స్‌ను తొలగించి భర్త మృతదేహాన్ని పాతిపెట్టినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సోదరుల అనుమానంతో వెలుగోకి అసలు విషయం..
అయితే కొన్ని రోజులుగా విజయ్ కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన అతని సోదరులు. సోమవారం ఉదయం విజయ్ ఇంటికి వచ్చారు. తమ సోదరుడి కోసం వాళ్ల వదిన కోమల్‌ను అడిగారు. అయితే ఈ క్రమంలో ఇంట్లోని కొన్ని టైల్స్ దెబ్బతిని, వాటి రంగు మిగతా వాటి కంటే తేడా ఉండటం వారు గమనించారు. దీంతో అనుమానం వచ్చి తేడాగా ఉన్న టైల్స్‌ను తవ్వి చూశారు. టైల్స్ తీసిన వెంటనే దుర్వాసనతో పాటు మృతదేహం బయటపడింది. దీంతో విజయ్ సోదరులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, హుహాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది విజయ్ చవాన్ మృతదేహమేనని నిర్ధారించారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
ఇంట్లో బాత్రూమ్ మరమ్మతులు చేస్తున్నట్టు నాటకం..
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా విజయ్ భర్త కొమలిపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రియుడు మోనుతో కలిసి భార్య విజయ్‌ను హత్య చేసినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీంతో కోమల్, మోనులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. టైల్స్ బయటకు తీసినప్పుడు స్థానికులు వాటి గురించి అడడగా.. బాత్రూమ్ మరమ్మతులు చేస్తున్నామని అందుకోసమే టైల్స్ తొలగిస్తున్నట్లు కోమల్ స్థానికులకు చెప్పి ఏమార్చినట్టు గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




