Maharashtra Political Crisis: మా దగ్గరకు రండి.. మంచి ఆతిథ్యం ఇస్తాం.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మమతా సెటైర్లు..

Mamata Banerjee: మహారాష్ట్రలోని మహావికాస్‌ అఘాడీ (MVA) ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నడాన్ని విమర్శించారు. వరదలతో సతమతమవుతున్న అస్సాంకు..

Maharashtra Political Crisis: మా దగ్గరకు రండి.. మంచి ఆతిథ్యం ఇస్తాం.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మమతా సెటైర్లు..
Mamata Banerjee

Updated on: Jun 23, 2022 | 8:29 PM

మహా సంక్షోభంపై విరుచుకుపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మహారాష్ట్రలోని మహావికాస్‌ అఘాడీ (MVA) ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నడాన్ని విమర్శించారు. వరదలతో సతమతమవుతున్న అస్సాంకు మహారాష్ట్ర ఎమ్మెల్యేలను ఎందుకు పంపారని ప్రశ్నించారు. మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్‌కు పంపాలని ట్వీట్‌ చేశారు. వారిని బాగా ఆతిథ్యం ఇస్తాం ఇస్తామంటూ పేర్కొన్నారు. శివసేన మంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృతంలో తిరుబాటు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు గౌహతిలో బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద టీఎంసీ కార్యకర్తలు గురువారం నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ మేరకు స్పందించారు. ‘బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బుల్డోజర్‌తో కూల్చివేసిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి ఎన్నికల సమయంలో..

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించేందుకు బీజేపీ సమయాన్ని ఎంచుకుంటోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో లక్ష ఓట్ల వెనుకబడి ఉన్నామని అందుకే ఈసారి ఎంపిక చేశామని చెబుతున్నారు. వారికి (BJP) డబ్బుకు లోటు లేదు. గుర్రపు వ్యాపారం చేయగలరు. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రజారాజ్యం పట్ల అనుమానం కలుగుతోందన్నారు. మనతో పాటు ఈ దేశానికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఉద్ధవ్ ఠాక్రేకు, అందరికీ న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నామమంటూ ట్వట్టర్ లో పేర్కొన్నారు.

వరదల ముప్పుతో కొట్టుమిట్టాడుతున్న అస్సాం బాధిత ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మహారాష్ట్ర ఎమ్మెల్యేలను ఎందుకు అక్కడికి పంపుతున్నారు. ఈరోజు మీరు అధికారంలో ఉండి డబ్బును, పవర్ మాఫియాను బాగా వాడుకుంటున్నారు.

వారిని (తిరుగుబాటు ఎమ్మెల్యేలను) అస్సాంకు బదులు బెంగాల్‌కు ఇక్కడకు పంపండి. మేము వారిని బాగా చూసుకుంటాం. లేకుంటే వారు మహారాష్ట్ర తర్వాత ఇతర ప్రభుత్వాలను పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. మన కోసం, రాజ్యాంగం ప్రకారం” అని సీఎం మమత ట్వీట్‌లో బీజేపీని దుయ్యబట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

జాతీయ వార్తల కోసం