చెరువువైపు చూసి బిగ్గరగా అరుస్తోన్న కుక్క.. ఎంటా అని చూడగా గుండెలు పగిలే దృశ్యం

|

May 29, 2023 | 8:37 AM

పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు అన్నాచెల్లెలు చెరువుకు వెళ్లారు. ఇంతలో అనుకోని ప్రమాదం వారి పాలిట శాపంగా మారింది. ఊహించని రీతిలో చెరువులో విగతజీవులుగా తేలారు. ఈ విషాత ఘటన మహారాష్ట్రలోని డోంబివలీ దావాడీ గ్రామంలో..

చెరువువైపు చూసి బిగ్గరగా అరుస్తోన్న కుక్క.. ఎంటా అని చూడగా గుండెలు పగిలే దృశ్యం
Siblings Drown In Pond
Follow us on

పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు అన్నాచెల్లెలు చెరువుకు వెళ్లారు. ఇంతలో అనుకోని ప్రమాదం వారి పాలిట శాపంగా మారింది. ఊహించని రీతిలో చెరువులో విగతజీవులుగా తేలారు. ఈ విషాత ఘటన మహారాష్ట్రలోని డోంబివలీ దావాడీ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్ధి రంజిత్‌ రవీంద్రన్‌(22), అతని చెల్లెలు కీర్తి రవీంద్రన్‌(16) తమ తల్లిదండ్రులు పనినిమిత్తం ఆదివారం ఊరు వెళ్లారు. దీంతో తమ పెంపుడు కుక్కను తీసుకుని స్కూటర్‌పై అన్నా చెల్లెల్లిద్దరూ సమీపంలోని గావ్‌దేవి చెరువుకు వెళ్లారు. కుక్కకు స్నానం చేయిస్తున్న సమయంలో ఊహించని విధంగా నీటిలో మునిగిపోయారు. కళ్ల ముందే వాళ్లిద్దరూ నీటిలో మునిగిపోతుంటే సహాయం కోసం కుక్క పెద్దగా అరవడం ప్రారంభించింది. అయితే దాని ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అటుగా వెళ్తున్న గ్రామస్థులు కుక్క చెరువువైపు చూస్తూ మొరుగుతుండటాన్ని గమనించారు. అనుమానంతో గ్రామస్థులు చెరువులో చూడగా అన్నా చెల్లెళ్లు మునిగిపోయి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు గంటలపాటు గాలించి అన్నాచెల్లెళ్ల మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అన్నాచెల్లెళ్లు చదువులో అత్యుత్తమ ప్రతిభకనబరిచేవారని స్థానికులు తెలిపారు. కీర్తి 10వ తరగతిలో 98 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిందని, రంజిత్‌ కూడా ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడని పేర్కొన్నారు. వారికి తమ పెంపుడు కుక్క అంటే ఎంతో ప్రేమని, ఇంతలో ఇద్దరూ ఒక్కసారే మరణించారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.