AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మకు కడుపుకోత.. ఫోన్‌ ఇవ్వడం లేదని 16ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే..

నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మనందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మొబైల్‌ ఫోన్‌ అనేది ప్రజలకు ఒక వ్యసనంగా మారిపోయింది. వీరిలో పిల్లలు కూడా ఉంటున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు మారాం చేయకుండా ఉండేదుకు గానూ వారి చేతిలో మొబైల్‌ పెట్టేస్తున్నారు. అలాగే, మరికొందరు పిల్లలు ఫోన్‌ చూస్తే గానీ భోజనం చేయరు. ఇలా ఎంతోమంది పిల్లలు మొబైల్‌ఫోన్‌కి బానిసలుగా మారిపోతున్నారు.

అమ్మకు కడుపుకోత.. ఫోన్‌ ఇవ్వడం లేదని 16ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే..
Boy Dies By Suicide
Jyothi Gadda
|

Updated on: Aug 04, 2025 | 4:34 PM

Share

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ మొబైల్‌ ఫోన్‌ బాగా అలవాటైపోయింది. ఒక పూట తిండి లేకపోయినా ఉంటారు.. కానీ, చేతిలో మొబైల్‌ ఫోన్‌ లేకుండా మాత్రం చాలా మంది ఉండలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మొబైల్‌ ఫోన్‌ అనేది ప్రజలకు ఒక వ్యసనంగా మారిపోయింది. వీరిలో పిల్లలు కూడా ఉంటున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు మారాం చేయకుండా ఉండేదుకు గానూ వారి చేతిలో మొబైల్‌ పెట్టేస్తున్నారు. అలాగే, మరికొందరు పిల్లలు ఫోన్‌ చూస్తే గానీ భోజనం చేయరు. ఇలా ఎంతోమంది పిల్లలు మొబైల్‌ఫోన్‌కి బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఒక 16ఏళ్ల బాలుడు అమ్మ ఫోన్‌ ఇవ్వడం లేదని దారుణానికి పాల్పడ్డాడు.

మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఖావ్డాలో 16 ఏళ్ల బాలుడు తన తల్లి మొబైల్ ఫోన్ కొనివ్వడం లేదని కొండ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.16ఏళ్ల అథర్వ గోపాల్ టేడే తన తల్లిని మొబైల్‌ ఫోన్‌ కొని ఇవ్వమని చాలాసార్లు అడిగాడు. తల్లి నిరాకరించడంతో టిస్‌గావ్‌ వద్ద ఉన్న కొండపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అథర్వను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫోన్ వల్ల కలిగే ప్రమాదాలు:

ఇవి కూడా చదవండి

నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మనందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం లేవడం నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం ఎక్కువ సమయం స్క్రీన్‌పైనే గడుపుతాము. సోషల్ మీడియా, గేమ్స్‌, చాటింగ్, వీడియోలు చూసే అలవాటు మనల్ని గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోబెడుతుంది.

రోజంతా ఫోన్ ఉపయోగించిన తర్వాత మెదడు బరువుగా, అలసిపోయినట్లు అనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రజలు ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న విధానం వారి అభ్యాస సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా తగ్గిస్తోంది.

ఇది మాత్రమే కాదు, న్యూరోడీజెనరేషన్ ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 18-25 సంవత్సరాల మధ్య ఎక్కువసేపు స్క్రీన్‌ను చూడటం వల్ల మెదడు బయటి పొర అయిన సెరిబ్రల్ కార్టెక్స్ సన్నబడటానికి కారణమవుతుందని అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…

Follow Us
వయసు పైబడ్డా మీ దంతాలు ఊడకుండా వజ్రంలా బలంగా ఉండాలంటే..
వయసు పైబడ్డా మీ దంతాలు ఊడకుండా వజ్రంలా బలంగా ఉండాలంటే..
పెరుగులో ఉప్పు బెటరా? లేదా చక్కెరా? ఎలా తీసుకుంటే ప్రయోజనం
పెరుగులో ఉప్పు బెటరా? లేదా చక్కెరా? ఎలా తీసుకుంటే ప్రయోజనం
నానమ్మల కాలంనటి ఈ రైస్ తింటే మెతుకు కూడా మిగల్చరు!
నానమ్మల కాలంనటి ఈ రైస్ తింటే మెతుకు కూడా మిగల్చరు!
వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా..? ఈ 10 ట్రిక్స్ ఫాలో అవ్వండి
వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా..? ఈ 10 ట్రిక్స్ ఫాలో అవ్వండి
టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే.. . పూర్తి లెక్కలివే..!
టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే.. . పూర్తి లెక్కలివే..!
ఈ స్పెషల్ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్‌తో మీ ఉదయాన్ని ఎంతో హుషారుగా షురూ
ఈ స్పెషల్ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్‌తో మీ ఉదయాన్ని ఎంతో హుషారుగా షురూ
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీ తప్పనిసరి! లేదంటే తప్పదు?
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీ తప్పనిసరి! లేదంటే తప్పదు?
ఉదయం పూట నీరు తాగి మీ రోజును ప్రారంభిస్తే ఆ రోగాలన్నీ మాయం..
ఉదయం పూట నీరు తాగి మీ రోజును ప్రారంభిస్తే ఆ రోగాలన్నీ మాయం..
నిద్రపోతున్నప్పుడు పాదాలు తలుపు వైపు ఉంటే అశుభమా? వాస్తు హెచ్చరిక
నిద్రపోతున్నప్పుడు పాదాలు తలుపు వైపు ఉంటే అశుభమా? వాస్తు హెచ్చరిక
పోషకాల గని మునగాకుతో అదిరిపోయే టేస్టీ చట్నీ..అమృతం లాంటి రెసిపీ
పోషకాల గని మునగాకుతో అదిరిపోయే టేస్టీ చట్నీ..అమృతం లాంటి రెసిపీ