AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. విమానంలో బొద్దింకలు.. సారీ చెప్పిన ఎయిర్‌ ఇండియా

ఈ సంఘటన దురదృష్టకరమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్‌ ఇండియా సంస్థ విమాన నిర్వహణపరంగా అంతా సక్రమంగానే ఉన్నప్పటికీ.. గ్రౌండ్ ఆపరేషన్స్ సమయంలో ఈ కీటకాలు ఒక్కోసారి విమానంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని ఎయిరిండియా ప్రతినిధి తన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని చెప్పారు.

బాబోయ్.. విమానంలో బొద్దింకలు.. సారీ చెప్పిన ఎయిర్‌ ఇండియా
Air India Flight
Jyothi Gadda
|

Updated on: Aug 04, 2025 | 2:44 PM

Share

ఎయిర్ ఇండియా AI180 విమానంలో బొద్దింకలు కలకలం రేపాయి. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వెళ్తున్న విమానంలో బొద్దింకలు కనిపించడంతో ఇద్దరు ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. వారిని ఇతర సీట్లకు మార్చడంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. ఆ తర్వాత విమానం ఫ్యూయల్‌ ఫిల్లింగ్‌కోసం కోల్‌కతాలో ఆగినప్పుడు గ్రౌండ్‌ సిబ్బంది విమానాన్ని డీప్‌ క్లీన్‌ చేసినట్లు ఎయిర్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. తర్వాత షెడ్యూల్ సమయం ప్రకారమే ముంబయికి విమానం చేరుకుంది.

జరిగిన ఘటనపై సంస్థ క్షమాపణలు తెలిపింది. ఈ సంఘటన దురదృష్టకరమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్‌ ఇండియా సంస్థ విమాన నిర్వహణపరంగా అంతా సక్రమంగానే ఉన్నప్పటికీ.. గ్రౌండ్ ఆపరేషన్స్ సమయంలో ఈ కీటకాలు ఒక్కోసారి విమానంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని ఎయిరిండియా ప్రతినిధి తన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…