AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో ఎంత ఘోరం.. లిఫ్టులో చిక్కుకుని 12 ఏళ్ళ బాలుడు దుర్మరణం..!

మహారాష్ట్రలో తీవ్ర విషాదంలో చోటు చేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకుని 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పూణేలోని చార్హోలి హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆ పిల్లవాడు లిఫ్టులో పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, లిఫ్ట్‌లో చిక్కుకున్నాడని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా లిఫ్టు ఆగిపోవడంతో ఉపిరాడక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

అయ్యో ఎంత ఘోరం.. లిఫ్టులో చిక్కుకుని 12 ఏళ్ళ బాలుడు దుర్మరణం..!
12 Year Old Boy Dies
Balaraju Goud
|

Updated on: Oct 05, 2025 | 8:14 AM

Share

మహారాష్ట్రలో తీవ్ర విషాదంలో చోటు చేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకుని 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పూణేలోని చార్హోలి హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆ పిల్లవాడు లిఫ్టులో పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, లిఫ్ట్‌లో చిక్కుకున్నాడని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా లిఫ్టు ఆగిపోవడంతో ఉపిరాడక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఒక పిల్లవాడు లిఫ్ట్‌లో చిక్కుకున్నట్లు తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపక దళ అధికారుల తెలిపారు. ఆ తర్వాత ఒక బృందం అక్కడికి చేరుకుంది. టీనేజర్ మూడవ, నాల్గవ అంతస్తుల మధ్య చిక్కుకున్నాడు. అతని శరీరం దిగువ భాగం లిఫ్ట్ – షాఫ్ట్ గోడ మధ్య చిక్కుకుంది. దీంతో గంటల తరబడి శ్రమించిన తర్వాత, పిల్లవాడిని లిఫ్ట్ నుండి బయటకు తీసుకువచ్చామని అధికారులు తెలిపారు.

సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అమీ ఫడ్తారే అనే బాలుడు లిఫ్ట్ దగ్గర సైకిల్‌తో ఆడుకుంటున్నాడు. ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ డోర్ తెరిచినప్పుడు, అతను బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ క్యాబిన్ క్రిందికి జారిపోయింది. అతను మూడవ-నాల్గవ అంతస్తుల మధ్య చిక్కుకున్నాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

అగ్నిమాపక సిబ్బంది మొదట లిఫ్ట్ కంట్రోల్ రూమ్ డోరును పగలగొట్టారు. తరువాత లిఫ్ట్‌ను కిందకు దించి పిల్లవాడిని బయటకు తీశారు. ఆ వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అగ్నిమాపక దళం అధికారులు లిఫ్ట్ సెన్సార్ పనిచేయకపోవడమే కారణమని అనుమానిస్తున్నారు. ఈ భవనం 2014లో నిర్మించారు. దాదాపు 11 సంవత్సరాల పురాతనమైన, సరైన నిర్వహణ లేని లిఫ్ట్ పనిచేయకపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. “ఈ సంఘటనను సాంకేతిక కోణం నుండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాపు బంగర్ అన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..