AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakumh Mela-2025: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘తేజస్ పండల్’

ప్రతీరోజూ ప్రతీ క్షణం అక్కడ పరమ పవిత్రమే. భోగి నుంచి మహాశివరాత్రిదాకా.. 45రోజులు అదో ఆధ్యాత్మిక ప్రపంచం. కోట్లమంది ఒక్కచోట ఉన్నా నిష్టగా పుణ్యస్నానాలు, పూజలే తప్ప మరో ఆలోచన ఉండదు. పరమ పవిత్రమైన ఉత్సవం కాబట్టే మహాకుంభమేళాకు విశ్వవ్యాప్తంగా ఇంత గుర్తింపు. కుంభమేళా ఒక ఆధ్యాత్మిక సంరంభం.. అదో అద్భుత కార్యక్రమం.

Mahakumh Mela-2025: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ 'తేజస్ పండల్'
Tejas Pandal
Balaraju Goud
|

Updated on: Jan 17, 2025 | 11:54 AM

Share

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్‌గా జరుగుతోంది. మహా కుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక అక్కడికి విచ్చేసిన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారత వైమానిక దళం (IAF)కి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘తేజస్ పండల్’ ప్రయాగ్‌రాజ్‌లోని భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని నిర్మాణంలో మహంత్ బ్రిజ్‌భూషణ్ దాస్ జీ మహారాజ్ కీలక పాత్ర పోషించారు. భారతదేశం పురోగతి, బలాన్ని ప్రదర్శించడమే ఈ పండల్ ముఖ్య ఉద్దేశ్యమని చెబుతున్నారు. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు పండల్‌ను సందర్శిస్తున్నారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. భారత దేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటున్నారు.

మహంత్ బ్రిజ్‌భూషణ్ దాస్ జీ మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ, “తేజస్ విమానం భారతదేశానికి గర్వకారణమని, భారత్ శక్తికి చిహ్నంగా నిలచిందన్నారు. ఇది మన దేశంలోనే నిర్మించడం పెరుగుతున్న స్వావలంబనకు నిదర్శనమన్నారు. ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించడానికి మహాకుంభ్‌లో తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ గేట్‌ను రూపొందించామని తెలిపారు. భారతదేశం ఇప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేంత బలంగా ఉందని సందేశం ఇస్తున్నామని మహారాజ్ పేర్కొన్నారు. ఇకపై ఇతరులపై ఆధారపడకుండా, చంద్రుడు, అంగారక గ్రహం దాటి చేరుకున్నామన్నారు. తేజస్ విమాన నమూనా కట్టడాన్ని భారతన సైనికులకు అంకెతం చేస్తున్నామని ఆయన తెలిపారు.

విపిన్ ఉపాధ్యాయ్ ఆచార్య మాట్లాడుతూ ఈ డిజైన్ వెనుక యువ తరానికి స్ఫూర్తినివ్వడమే లక్ష్యమన్నారు. “శ్రీ రామానందాచార్య మఠం శిబిరంలో ఆచార్యగా సేవ చేయడం గౌరవంగా ఉందన్నారు. ఈ శిబిరంలో తేజస్ విమానం, స్తంభం ఆకారంలో నిర్మించడం, భారతదేశ గర్వానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ డిజైన్ వెనుక ఉన్న లక్ష్యం యువకులను ప్రేరేపించడం. మహాకుంబ్ ఉద్దేశ్యం భారతదేశ యువతను ముందుకు సాగేలా ప్రోత్సహించడం, అర్థవంతమైన పనిలో పాల్గొనడం, మనమందరం గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడమే లక్ష్యమన్నారు. తేజస్ పండల్ భక్తులకు ఆకర్షణీయ కేంద్రంగా మాత్రమే కాకుండా, భారతదేశ సంస్కృతి తోపాటు అభివృద్ధికి తెలియజేస్తుంది.

ఇదిలావుండగా, పవిత్ర నగరమైన ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ మేళా సందర్భంగా నాల్గవ రోజున త్రివేణి సంగమం వద్ద 3 మిలియన్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్ ఫిబ్రవరి 26 (బుధవారం) వరకు కొనసాగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..