Kidnap Case: కిడ్నాపర్లకు రూ. 15 లక్షలు చెల్లించేందుకు.. చందాలు వేసుకుంటున్న గ్రామస్థులు..

గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు రామ్‌ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ నాలుగు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయారు. వారి కోసం ఆరా తీస్తున్న క్రమంలో ఓ ముఠా వారిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.

Kidnap Case: కిడ్నాపర్లకు రూ. 15 లక్షలు చెల్లించేందుకు.. చందాలు వేసుకుంటున్న గ్రామస్థులు..
Crowd Fund
Follow us

|

Updated on: Jan 21, 2023 | 6:31 PM

గ్యాంగ్‌స్టర్లు కిడ్నాప్ చేసిన ముగ్గురు రైతులను విడిపించేందుకు ఆ ఊరంతా ఏకమైంది. కిడ్నాపర్లు డిమాండ్‌ చేసిన డబ్బు సేకరించేందుకు గ్రామస్తులంతా కలిసి చందాలు వేసుకుంటున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌ జిల్లాలో వెలుగు చూసింది. ష్యోపూర్‌లోని ఓ గ్రామానికి చెందిన ముగ్గురు రైతులను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన తమవారి కోసం గ్రామస్తులు ఆందోళనపడ్డారు. గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు రామ్‌ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ నాలుగు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయారు. వారి కోసం ఆరా తీస్తున్న క్రమంలో రాజస్థాన్‌లోని ఓ ముఠా వారిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.

కాగా, గ్రామస్తులు కిడ్నాపర్లను సంప్రదించగా, రూ.15 లక్షలు చెల్లిస్తేనే ఆ ముగ్గురిని విడిచిపెడతామంటూ డిమాండ్‌ చేశారు. దీంతో గ్రామస్తులంతా ఆందోళనలోపడ్డారు. బాధిత కుటుంబీకులు భయంతో బోరున విలపించారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ పేదవారే. వారిలో ఎక్కువ మంది పశువుల పెంపకందారులు. కిడ్నాప్‌కు గురైన రైతుల్లో ఒకరు మరీ నిరుపేద. కనీసం అతని ఇంటికి సరైన పైకప్పు కూడా లేదని తెలిసింది. ఇలాంటి క్రమంలో అంత పెద్దమొత్తంలో డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక గ్రామస్తులంతా కలిసి చందాలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసి చందాలు వసూలు చేస్తున్నారు.

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు రాంనివాస్‌ రావత్‌ గ్రామానికి చేరుకుని గల్లంతైన రైతుల కుటుంబాలను పరామర్శించారు. దొంగల దాడుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది రైతులు మేకలతో సహా తమ పశువులను విక్రయిస్తున్నారని రావత్ చెప్పారు. యువకులను అపహరించిన వారి గురించి సమాచారం ఇస్తే తొలుత రూ.10 వేలు రివార్డు ఇస్తామని ఆయన కార్యాలయం ప్రకటించగా.. ఇప్పుడు చంబల్ రేంజ్ ఏడీజీపీ దాన్ని రూ.30వేలకు పెంచినట్లు షీపూర్ ఎస్పీ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

షియోపూర్ పోలీసులు రాజస్థాన్ పోలీసులతో టచ్‌లో ఉన్నారు. అయితే రైతుల గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. రాజస్థాన్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని సరిహద్దు జిల్లాలలో, ముఖ్యంగా షియోపూర్ జిల్లాలో చురుకుగా ఉన్నాయని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..