హనీమూన్ ఎపిసోడ్‌లో విచారిస్తున్న కొద్ది ఊహించని ట్విస్ట్‌లు.. వెలుగులోకి కొత్త కోణం!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హనీమూన్ మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీని చంపించిన భార్య సోనమ్.. ఆ తర్వాత ఇండోర్ వెళ్లి ప్రియుడు రాజ్ కుష్వారాను కలిసింది. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. అక్కడి నుంచి పారియేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హనీమూన్ మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీని చంపించిన భార్య సోనమ్.. ఆ తర్వాత ఇండోర్ వెళ్లి ప్రియుడు రాజ్ కుష్వారాను కలిసింది. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. అక్కడి నుంచి పారియేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
రాజా రఘువంశీ హత్య కేసులో, అతని భార్య సోనమ్ హత్య కుట్రలో పాలుపంచుకున్నట్లు అంగీకరించింది. సదర్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణ సందర్భంగా, రాజా హత్య ప్రణాళికలో తాను కూడా పాల్గొన్నట్లు సోనమ్ చెప్పింది. వాస్తవానికి, కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఆమెపై సేకరించిన ఆధారాల గురించి సోనమ్‌కు చెప్పింది. దీని తర్వాత, హత్య కుట్రలో తాను కూడా పాల్గొన్నట్లు సోనమ్ అంగీకరించింది. రాజా హత్య కేసు నిందితులను పోలీసులు షిల్లాంగ్‌లో ముఖాముఖికి తీసుకువచ్చారు. ఈ సమయంలో, సోమన్, రాజ్ కూడా ముఖాముఖికి వచ్చారు. ఈ సమయంలో, SIT విచారణలో సోనమ్ హత్యను అంగీకరించారు. SIT చూపించిన ఆధారాలను చూసిన తర్వాత సోనమ్ తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది.
రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో రాజా రఘువంశీ భార్య సోనమ్, సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహా, ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లు ఆనంద్, ఆకాష్ రాజ్‌పుత్, విశాల్ అలియాస్ విక్కీ ఠాకూర్ ఉన్నారు. సోనమ్‌ను యూపీలోని ఘాజీపూర్‌లో అరెస్టు చేశారు. రాజ్ కుష్వాహా, విశాల్‌లను ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆకాష్ రాజ్‌పుత్‌ను మధ్యప్రదేశ్‌లోని సాగర్ నుండి, ఆనంద్‌ను యూపీలోని లలిత్‌పూర్ నుండి అరెస్టు చేశారు. రాజాను హత్య చేసిన ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లు విశాల్, ఆనంద్, ఆకాష్ కూడా తమ నేరాన్ని అంగీకరించారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం, సోనమ్‌కు తన సొంత ఫ్యాక్టరీలో పనిచేసే రాజ్ కుష్వాహాతో సంబంధం ఉన్నట్లు తేలింది.
హనీమూన్ కోసం ఇండోర్ నుంచి షిల్లాంగ్ వెళ్లిన నవ దంపతులు.. మే 23వ తేదీన అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. కనిపించకుండాపోయిన సోనమ్ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యక్షమైంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి.. ఘాజీపూర్‌లో వదిలేశారని ఆరోపించింది. కానీ అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపడేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. మే 25- 27 మధ్య సోనమ్ ట్రైన్‌లో ఇండోర్ వెళ్లి ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసింది. హత్యకి ముందు ఆ తర్వాత ఏం జరిగిందో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఓ ట్యాక్సీ మాట్లాడి సోనమ్‌ను యూపీకి పంపించాడు రాజ్ కుష్పాహా.
ఇదిలావుంటే, రాజ్ కుష్వాహాతో సోనమ్ సంబంధం గురించి ఇంట్లో వాళ్లకి ముందే తెలుసన్నారు రఘువంశీ సోదరుడు విపిన్. ఇష్టం లేకున్నా బలవంతంగా రఘువంశీతో పెళ్లి జరిపించారన్నాడు. పెళ్లి చేసుకుంటాను.. ఆ తర్వాత రఘువంశీని ఏం చేస్తానో చూడు.. అవన్నీ మీరు భరించాల్సిందేనని సోనమ్ తన తల్లితో చెప్పిందన్నాడు విపిన్. ఇదే విషయాన్ని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
మరోవైపు తన బిడ్డ హత్యకు కుజదోషమే కారణమని ఆరోపించింది రఘువంశీ తల్లి. సోనమ్‌కు కుజదోషం ఉందని.. దాన్ని తొలగించుకోవడం కోసం పథకం ప్రకారం తన కొడుకును పెళ్లాడిందన్నారు. గౌహతి కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు అందులో భాగమన్నారు. కుజదోషం పొగొట్టుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో అరటి చెట్టుతో పెళ్లి చేసి చెట్టును కొట్టేసే ఆచారం ఉందన్నారు. అరటి చెట్టులా తన కొడుకును పెళ్లి చేసుకుని హతమార్చిందని అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు దోపిడి దొంగల పనిగా నమ్మించేందుకు బంగారం ధరించాల్సిందిగా రఘువంశీపై సోనమ్ ఒత్తిడి తెచ్చిందన్నారు. తన సోదరుడు అమాయకుడంటోంది రాజ్ కుష్వాహా సోదరి సుహానీ. సోనమ్‌ను అక్కా అని పిలిచేవాడని.. రాజ్ తప్పు చేశాడని అందరూ అంటుంటే నమ్మశక్యంగా లేదన్నారు.
భర్తను హత్య చేయించిన సోనమ్.. అందర్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. రఘువంశీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి సాత్ జన్మోం కా సాథ్ హై అంటూ పోస్ట్ పెట్టింది. తమది ఏడు జన్మల బంధం అంటూ తన భర్త బతికే ఉన్నాడని నమ్మించింది. కానీ హనీమూన్ సమయంలో సోనమ్ ఒక్క ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని పోలీసులు గుర్తించారు. రఘువంశీ హత్య తర్వాత స్పాట్‌కి 10 కిలోమీటర్ల దూరంలో సోనమ్ ముగ్గురు వ్యక్తులతో మాట్లాడినట్టు పోలీసులు సీసీ టీవీలో గుర్తించారు.
రఘువంశీ మర్డర్ కేసులో.. సోనమ్ సహా మిగతా నలుగురు నేరాన్ని అంగీకరించారు. రఘువంశీని చంపే క్రమంలో సోనమ్ స్పాట్‌లోనే ఉందని, రాజ్ కుష్వాహ మాత్రం ఇండోర్ ఉన్నాడని నిందితులు పోలీసులకు వివరించారు.
ఇదిలావుంటే, సోనమ్ రాజా రఘువంశీని వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదు. సోనమ్ తన ప్రేమికుడు రాజ్‌ను మరచిపోలేకపోయింది. అందుకే రాజాను వదిలించుకోవడానికి ఆమె హత్య ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను రూపొందించడంలో రాజ్ కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు. వివాహం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత, ఫ్లాన్‌లో భాగంగానే మే 20న, రాజా, సోనమ్ షిల్లాంగ్‌కు బయలుదేరారు. వారు మే 23న షిల్లాంగ్ చేరుకున్నారు మరియు అదే రోజున హంతకులు రాజాను చంపారు. హనీమూన్ ఎపిసోడ్‌లో విచారిస్తున్నా కొద్ది ఊహించని మలుపులు, కొత్త కోణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..