సీన్ రివర్స్.. హస్తం గూటికి కమలం నేత.. రీజన్ ఇదేనా..?
గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ గూటికి చేరడం కామన్ అయ్యింది. అయితే మధ్యప్రదేశ్‌లో సీన్ రివర్స్ అయ్యింది.

గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ గూటికి చేరడం కామన్ అయ్యింది. అయితే మధ్యప్రదేశ్‌లో సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి చెందిన నేత హస్తం గూటికి చేరారు. ఆయన గతంలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనే బాలేందు శుక్లా.. శుక్రవారం నాడు మాజీ సీఎం కమల్ నాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని.. సొంత గూటికి చేరుకున్నారు. బాలేందు శుక్లా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కమల్ నాథ్ స్పందించారు. గతంలో వేరే కారణాలతో ఆయన పార్టీ వీడారని.. తిరిగి సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో శుక్లా బాటలో మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలిపారు.
బాలేందు శుక్లా.. 2009లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అప్పట్లో ఆయనకు.. జ్యోతిరాదిత్య సింధియాకు మధ్య విభేదాలు రావడంతో.. పార్టీ మారారు. అయితే ఇప్పుడు సిందియా బీజేపీలోకి ఎంటర్ అవ్వడంతో.. ఆయన తన విభేదాలను గుర్తుంచుకొని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే శుక్లా సొంతగూటికి చేరడంతో.. కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి.