థానే, ఫిబ్రవరి 23: ఓ రోడ్డు ప్రమాద ఘటనలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల క్రితం నాసిక్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.1.49 కోట్ల పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ మేరకు సంబంధిత వ్యక్తులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలు కేసు ఏంటంటే..
ముంబైలోని బోరివలిలో నివాసం ఉంటున్న నీలేశ్ జోషి (39) అనే వ్యక్తి 2018 నవంబర్ 10వ తేదీన తన ఎస్‌యూవీ కారులో వెళ్తుండగా నాసిక్ సమీపంలోని సిన్నార్-షిర్డీ రోడ్డులోని పెట్రోల్ పంపు వద్ద ఓ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నీలేశ్‌తో పాటు అదే కారులో ప్రయాణిస్తోన్న మరో అయిదుగురు మృతి చెందారు. నీలేశ్ చనిపోయే నాటికి ఓ ప్రైవేటు ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ సంస్థలో పనిచేస్తున్నాడు. అప్పట్లోనే అతను నెలకు రూ.లక్ష వేతనంగా పొందుతున్నాడు. మరో కన్సల్టెన్సీ సంస్థకు అందిస్తున్న సేవలకు గాను నెలకు రూ.75వేలు సంపాదిస్తున్నాడు. ఈ ప్రమాదంలో నీలేశ్ మృతి చెందడంతో అతనిపైనే అధారపడిన అతని కుటుంబం కేసు నమోదు చేశారు. ఇటీవల మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ముందుకు ఈ కేసు విచారణకు రాగా మృతుడి తరపు బంధువులు కోర్టుకు వివరాలను అందించారు. ఫిబ్రవరి 12 నాటి తన ఉత్తర్వుల మేరకు వివరాలను గురువారం అందుబాటులో ఉంచారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం నీలేశ్ బంధువులకు రూ.1.49 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఆ మొత్తానికి 7.5 శాతం వడ్డీని కూడా జత చేసి అందించాలని తీర్పు వెలువరించింది. బస్సు యజమాని చంద్రకాంత్ లక్ష్మీనారాయణ ఇందాని నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణం అయినందుకుంకు గానూ అతను, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు రూ. 1.49 కోట్లు చెల్లించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుండి 7.50 శాతం వడ్డీతో పాటు జోషి. మ్యాక్ట్ (MACT) చైర్‌పర్సన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎస్బీ అగర్వాల్ తీర్పు వెలువరించారు.
మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.