హైటెక్ దొంగ.. ఖైరీదైన కార్లే అతగాడి టార్గెట్.. 20 ఏళ్లలో ఎన్ని కార్లు కొట్టేషాడో తెలిస్తే..
ఖరీదైన కార్లే అతని టార్గెట్.. అతనికి కంటికి లగ్జరీ కార్లు కనిపిస్తే ఇక అంతే సంగతులు.. ప్లాన్ వేయడం దాన్ని కొట్టేయడం అతని స్పెషాలిటీ.. ఇలా గడిచిన 20 ఏళ్లలో ఇతగాడు 100 లగ్జరీ కార్లను కొట్టేశాడు. వాటిని రాజస్థాన్, నేపాల్‌లలో విక్రయించి వచ్చిన డబ్బుతో విసాలవంతమైన జీవితాన్ని గడిపేవాడు. కానీ ఇతని ఆటలకు చెన్నై పోలీసులు అడ్డుకట్టవేశారు. చెన్నైయ్‌లో ఓ కారు దొంగతనం కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

రాజస్థాన్‌కు చెందిన సతేంద్ర సింగ్ షెకావత్ గత 20 ఏళ్లలో 100 కి పైగా లగ్జరీ కార్లను దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో ఆధునిక పరికరాలను ఉపయోగించి కార్లను దొంగిలించి, వాటిని రాజస్థాన్, నేపాల్‌లలో విక్రయించి.. వచ్చిన విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇన్నాళ్లు పోలీసులకు చిక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ కేటుగాడు ఈసారి పోలీసులకు దొరికిపోయాడు. ఇటీవల చెన్నైలోని అన్నానగర్‌లో జరిగిన దొంగతనం కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కారు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పుదుచ్చేరిలో ఉన్నట్టు సమాచారం అందడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు అతని అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.
అన్నానగర్‌లో లగ్జరీ కారు దొంగతనం
చెన్నైలోని అన్నానగర్ కతిరవన్ కాలనీకి చెందిన ఎథిరాజ్ రతినం అనే వ్యక్తి గత నెలలో తన ఖరీదైన లగ్జరీ కారును తన ఇంటి వద్ద పార్క్ చేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామును ఒక గుర్తుతెలియని వచ్చిన ఆదునిపక పరికరాతో కారును అన్‌లాక్ చేసి ఎత్తుకెళ్లినట్టు అతను సీసీ ఫుటేజ్ దృశ్యాల ద్వారా కనుగొన్నాడు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం వెతకడం స్టార్ట్ చేశారు. నిందితుడు పుద్దుచ్చేరిలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అతన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన షెకావత్‌గా పోలీసులు గుర్తించారు.
నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్ దొంగ
దర్యాప్తులో భాగంగా నిందితుడు షెకావత్ ఎం.బి.ఎ. గ్రాడ్యుయేట్‌గా పోలీసులు గుర్తించారు, అతని తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి అని దర్యాప్తులో తేలింది. అయితే విలావంత జీవితాలకు అలవాటు పడిన షెకావత్ గత 20 సంవత్సరాలుగా దొంగతనాలు చేయడం ప్రారంభించినట్టు పోలీసులు గుర్తించారు. ఖరీదైన కార్లను టార్గెట్ చేసుకొని అదునాతన పరికరాలతో వాటి కీస్‌ను డీకోడ్ చేసి కార్లను దొంగలిస్తున్నట్టు తెలుసుకున్నారు. దొంగలించిన కార్లన్నింటినీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి వంటి ఇతర రాష్ట్రాల్లో విక్రయించి డబ్బులు సంపాదించేవాడని తెలిపారు. ఇతను నాటి నుంచి ఇప్పటివ వరకు సుమారు 100 కి పైగా లగ్జరీ కార్లను దొంగిలించినట్టు గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




