Lok Sabha Elections 2024: ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..

|

May 20, 2024 | 9:47 PM

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, బంగాల్‌ 7, బిహార్‌, ఒడిశాలో 5చొప్పున, ఝార్ఖండ్‌ 3, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్‌ జరిగింది.

Lok Sabha Elections 2024: ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
Lok Sabha Elections 2024
Follow us on

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం 49 స్థానాల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.  6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, బంగాల్‌ 7, బిహార్‌, ఒడిశాలో 5చొప్పున, ఝార్ఖండ్‌ 3, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్‌ జరిగింది. 5వ దశ లోక్‌సభ ఎన్నికలలో 57 శాతానికిపైగా ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓటింగ్ శాతంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది..

అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిందే, శివసేన నేతలు ఉద్ధవ్‌ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్‌ టాటా, ముకేష్‌ అంబానీ, అనిల్‌ అంబానీ తదితరులు కుటుంబాలతో కలిసి ఓటు వేశారు. అలాగే క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, కుమారుడితో కలిసి, అజింక్య రహానే భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, జాన్వీ కపూర్, దర్శకుడు జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ బాగ్నానీ, సంజయ్‌ దత్‌, మనోజ్‌ బాజ్‌పేయ్‌, అనిల్‌ కపూర్‌, హేమా మాలిని తదితరులు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని, ఓటు ఆవశ్యకతను వివరించారు.

ఈ ఐదో విడతలో పలు హై ప్రొఫైల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీతో బీజేపీ నేత దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ తలపడుతున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ నేత కిషోర్‌ లాల్‌ శర్మ మధ్య పోటీ నెలకొంది. లఖ్‌నవూలో రాజ్‌నాథ్‌సింగ్‌, వర్సెస్‌ సమాజ్‌వాదీ నేత రవిదాస్‌ మహరోత్రా ప్రత్యర్థులుగా ఉన్నారు. పియూష్‌ గోయల్‌, రోహిణి ఆచార్య, చిరాగ్‌ పాసవాన్‌, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ వంటి ప్రముఖుల భవితవ్యం ఈ ఐదో విడతలో తేలనుంది. మొత్తం 695మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

కాగా.. లోక్ సభ ఎన్నికలు మొత్తం 7విడతల్లో జరగనుండగా.. ఐదు విడతలు ముగిశాయి.. మే25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..