మరో నిర్భయ ఘటన.. ఇంతకీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఏం జరిగింది..?
Kolkata Doctor Rape-Murder Case: అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఆమె ప్రైవేటు పార్టులపై గాయాలు చేసి దారుణంగా చంపినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. మృతురాలి ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించిందని.. బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు.

వైద్యో నారాయణో హరిః వైద్యులు దేవుళ్లతో సమానం అని అర్థం. అలాంటి వైద్యులకే రక్షణ లేకుండా పోతే..? ప్రాణం పోయాల్సిన వైద్యుల ప్రాణాలు తీసుకుంటూ పోతే..? అవును.. మీరు వింటున్నది అక్షరాల నిజమే. మరికొద్ది రోజుల్లో స్టెతస్కోప్ పట్టుకుని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ట్రైనింగ్ అవుతున్న వైద్యవిద్యార్థినిని అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నాడు ఓ కీచకుడు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ అమానవీయ ఘటన కోల్‌కతానే కాకుండా దేశం మొత్తాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఘటన జరిగి ఐదు రోజులు అయినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నది. కేసు డైరీని, ఇతర డాక్యుమెంట్లను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. విధుల బహిష్కరణను విరమించుకోవాలని, రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న వైద్యులను చీఫ్ జస్టిస్ శివజ్ఞానం నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కోరింది. కేంద్రమంత్రి నడ్డా తమ డిమాండ్లకు అంగీకరించడంతో నిరసనలను విరమిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో అసోసియేషన్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సమగ్రమైన ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగించాలని ఎయిమ్స్ ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్స్, ఫెడరేషన్ ఆఫ్...