AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్టుకున్న వాడే కడతేర్చాడు.. భార్య గొంతు కోసి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టి.. చివరకు

భార్యను హతమార్చి, అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టాడు ఓ భర్త. కేరళలోని కొచ్చిలో ఈ దారుణం జరిగింది. ఏడాదిన్నర క్రితం ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ...

కట్టుకున్న వాడే కడతేర్చాడు.. భార్య గొంతు కోసి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టి.. చివరకు
Crime News
Ganesh Mudavath
|

Updated on: Jan 14, 2023 | 7:18 AM

Share

భార్యను హతమార్చి, అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టాడు ఓ భర్త. కేరళలోని కొచ్చిలో ఈ దారుణం జరిగింది. ఏడాదిన్నర క్రితం ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ అనంతరం మృతురాలి భర్తే.. ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తేల్చారు పోలీసులు. నిందితుడు సంజీవ్.. 2021, ఆగస్టు 16న భార్య రమ్యను గొంతు కోసి చంపాడు. తర్వాత ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా 2022 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగస్టు 2021 నుంచి తన భార్య కనిపించడం లేదంటూ వారికి చెప్పాడు. మొదటి నుంచి సంజీవ్​పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు.

సంవత్సరం పైగా ఈ కేసులో విచారణ జరిపి.. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2021, ఆగస్టులో భార్యభర్తలిద్దరికి ఫోన్ కాల్స్​ విషయంలో గొడవ జరిగింది. దీంతో భార్య రమ్యను హత్య చేశాడు సంజీవ్. అనంతరం కొచ్చిలోని ఎడవనక్కడ్ గ్రామంలోని తన ఇంట్లోనే పూడ్చేశాడని పోలీసులు తెలిపారు.

కేరళలో భార్యను చంపేసి, పూడ్చేసిన అనంతరం నిందితుడు.. తన భార్య రమ్య వేరే వ్యక్తి వెళ్లిపోయిందని బంధువులు, చుట్టుపక్కల వాళ్లను నమ్మించాడు. మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఏడాదిన్నరకు పైగా ఈ కేసుపై విచారణ చేసిన పోలీసులు.. ప్రస్తుతం అసలు విషయాలు తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..