ఏదో కారణంతో భూ ప్రపంచంలో ఎక్కడ చిక్కుకున్నా ఏదో అలా రక్షించవచ్చు. కానీ మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఏకంగా అంతరిక్షంలోనే ఇరుక్కుపోయారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఐదు నెలలుగా వెనక్కి రావడం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రాకెట్ సైన్స్ చరిత్రలోనే ఇది మేజర్ ఎర్రర్. రాకెట్ సైన్స్‌లోనే మమ్మల్ని మించిన వారు లేరంటూ విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకి ఇది పెద్ద సవాల్‌గా మారింది.
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
సునీత విలియమ్స్, బేరి విల్మోర్ ఇద్దరిని ఈ ఏడాది జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కేనర్వెల్ స్పేస్ స్టేషన్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్‌లో అంతరిక్షంలోకి పంపింది అమెరికా. ఈ ఇద్దరు వ్యోమగాములు కేవలం ఐదు రోజుల ట్రిప్ కోసమే అంతరిక్షంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం స్టార్ లైనర్ టెస్ట్‌తో పాటు నాసాలో కొన్ని కీలకమైన పరిశోధనలు జరిపి జూన్ 14 కల్లా భూమికి చేరుకోవాలి. కానీ అలా జరగలేదు. నిజానికి ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌తో పాటు మరో ఏడుగురు నాసాలోనే ఉన్నారు. తిరిగి వారిని రప్పించడంపై రకరకాల కారణాలు చెబుతుంది అమెరికా. ఇప్పటికీ సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీపై చాలా వాయిదాలు వేసింది. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమికి చేరుకుంటారంటూ తెలిపింది.
ఇప్పటికీ రెండుసార్లు స్పేస్ ఎక్స్ పేడిసిన్స్‌లో పాల్గొన్న సునీత విలియమ్స్ మూడోసారి మాత్రం చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది. గతంలో అత్యధికంగా 32 రోజులు ఆమె అంతరిక్షంలోనే గడిపింది. కానీ ఈసారి మాత్రం ఇంత లాంగ్ స్టే కోసం ప్రిపేర్ కాలేదు. ఇది ఆరోగ్య సమస్యలపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతుంది. సునీత విలియమ్స్ సెప్టెంబర్ 19న తన బర్త్‌డేని కూడా అనివార్యంగా రోదసిలోనే జరుపుకోవాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తెప్పించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది సైన్స్ కమ్యూనిటీలో జరుగుతున్న చర్చ. ఇందుకోసమే సునీత విలియమ్స్, విల్ మోర్‌లను భూమిపైకి రప్పించడానికి నాసా.. స్పేస్ ఎక్స్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే వాయిదాలపై వాయిదాలు వేస్తూ వ్యోమగాముల రిటన్ జర్నీపై రకరకాల కారణాలు వినిపిస్తుందని అంటున్నారు.
మరోవైపు 1969లోనే చంద్రునిపై అడుగుపెట్టామని, రాకెట్ సైన్స్ అమెరికాకు సైకిల్ సైన్స్ లాంటిదని గొప్పలు చెప్పుకునే అమెరికన్ సైంటిస్టులు ఈ ఇద్దరు వ్యోమగాముల పరిస్థితిపై మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో ఇదే అమెరికన్ స్పేస్ సెంటర్ నుంచి ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషయం ఇప్పటికీ మర్చిపోలేని మానని గాయమే. సునీత విలియమ్స్ క్షేమ సమాచారంపై, ఆరోగ్య పరిస్థితిపై సగటు భారతీయుల్లో కూడా ఆందోళన కలగడం కామన్. ఎన్ని రోజులు అంతరిక్షంలో ఉంటారో నిర్ణయించుకొని అందుకు తగ్గట్టుగా శరీరాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. లేకపోతే అక్కడ ఉండే రాపిడి వల్ల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఫిబ్రవరిలో అయినా సునీత విలియమ్స్ సేఫ్‌గా ల్యాండ్‌కు చేరుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.
ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..