Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఎవరెస్ట్ శిఖరం వద్ద కుప్పలు, తెప్పలుగా కింగ్ కోబ్రాస్..! ప్రమాదపు అంచున ఉన్నామా..?

మైదాన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం 2,700 మంది పాముకాటుతో మరణిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు. ఈ సంఖ్య ది లాన్సెట్ వంటి ప్రతిష్టాత్మక వైద్య పత్రికలలో ప్రచురించడం జరిగింది. చాలా కేసులు బయటకు రావని, ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే తాజాగా మైదాన ప్రాంతాల్లో ఉండాల్సిన పాములు మంచు కొండల్లో కనిపిస్తుండటంతో ఆందోళన మొదలైంది.

వామ్మో.. ఎవరెస్ట్ శిఖరం వద్ద కుప్పలు, తెప్పలుగా కింగ్ కోబ్రాస్..! ప్రమాదపు అంచున ఉన్నామా..?
King Cobras Near Mount Everest
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 08, 2025 | 8:03 PM

పాములు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం సమీపంలో పాములు కనిపించడంతో కలకలం రేగుతోంది. గత ఒకటిన్నర నెలల్లో, నేపాల్ రాజధాని ఖాట్మండులోని గ్రీన్ వ్యాలీలో 10 విషపూరిత పాములు కనిపించాయి. వీటిలో 9 కింగ్ కోబ్రాస్, ఒక మోనోకిల్ కోబ్రా ఉన్నాయి.

విషపూరిత పాములు సాధారణంగా వేడి, చదునైన ప్రాంతాలలో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అవి చల్లని ప్రాంతాలలో కనిపిస్తుండటం సంచలనం సృష్టించింది. నేపాల్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవెరెట్ ఖాట్మండు నుండి సరళ రేఖలో 160 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ విషపూరిత పాములు కనిపించడం పట్ల పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాట్మండు పోస్ట్ ప్రకారం, ఈ పాములను గుపాలేశ్వర్, భంజ్యాంగ్, సోఖోల్, ఫుల్చౌక్ వంటి ప్రాంతాల్లో కనిపించాయి. ఈ పాములు ఇళ్ళు, ప్రాంగణాలు, నివాస ప్రాంతాలలోకి కూడా ప్రవేశించాయి. వాటిని అటవీ శాఖ, పాము ప్రేమికులు పట్టుకున్నారు. ఆపై వాటిని అడవిలోకి వదిలేశారు. కొంతమంది గ్రామస్తులు అడవిలో ఈ పాముల గుడ్లు, పాము గూళ్లను కూడా చూశారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, విషపూరిత పాములు పర్వత ప్రాంతాలలోకి ప్రవేశించడమే కాదు. అవి ఇక్కడి వాతావరణంలో కూడా కలిసిపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే దీనికి కారణమని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు నేపాల్ పర్వత ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు మైదానాల కంటే వేగంగా పెరుగుతోంది. ఇది సంవత్సరానికి 0.05 డిగ్రీల సెల్సియస్. దీని కారణంగా, మైదానాలలో కనిపించే పాములు ఇప్పుడు పర్వతాలలో కూడా కనిపిస్తాయి.

మరోవైపు, ఈ పాములు కలప, గడ్డితో కూడిన ట్రక్కులో వచ్చి ఉండవచ్చని స్నేక్ రెస్క్యూ టీమ్ ప్రతినిధులు అంటున్నారు. కానీ ఇప్పుడు అవి శాశ్వతంగా ఇక్కడే ఉంటున్నాయి. మక్వాన్‌పూర్‌లోని దక్షిణకాళి, స్యూచతర్, గోకర్ణ, గోదావరి, సిస్నేరి ప్రాంతాల నుండి కింగ్ కోబ్రా, మోనోకిల్ కోబ్రాలను రక్షించారు.

ఇదిలావుంటే, 2030 నాటికి పాముకాటు మరణాలను 50% తగ్గించాలని నేపాల్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద, పర్వత ప్రాంతాలలో చికిత్సా కేంద్రాలను కూడా ప్రారంభించారు. భారతదేశం నుండి క్వాడ్రివాలెంట్ యాంటీ-వెనమ్ దిగుమతి అవుతుంది. దాని నుండి పాముకాటుకు వ్యతిరేకంగా టీకా తయారు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ, పిట్ వైపర్ వంటి స్థానిక పాముకాటుకు ఇప్పటికీ నమ్మదగిన చికిత్స లేదు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..