Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Empuraan: దశాబ్దాలుగా ఆ డ్యామ్ చుట్టూ ఎన్నో వివాదాలు.. ఈసారి ఎంపురాన్ సినిమా ఎందుకు టార్గెట్ అయ్యిందంటే..

ఎంపురాన్.. లూసిఫర్2 సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఆ సినిమాలోని కొన్ని సీన్లు రచ్చకు దారితీయడంతోపాటు డ్యామ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అసలేంటి ఆ డ్యామ్ కథ.. ఎందుకు మరోసారి చర్చనీయాంశంగా మారింది.. అనే వివరాలను పరిశీలిస్తే.. కేరళలో డ్యామ్ నిర్మాణం జరిగింది.. దాని అవసరం మాత్రం తమిళనాడుది..

Empuraan: దశాబ్దాలుగా ఆ డ్యామ్ చుట్టూ ఎన్నో వివాదాలు.. ఈసారి ఎంపురాన్ సినిమా ఎందుకు టార్గెట్ అయ్యిందంటే..
Mullaperiyar Dam Row
Follow us
Ch Murali

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 02, 2025 | 3:57 PM

ఎంపురాన్.. లూసిఫర్2 సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఆ సినిమాలోని కొన్ని సీన్లు రచ్చకు దారితీయడంతోపాటు డ్యామ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అసలేంటి ఆ డ్యామ్ కథ.. ఎందుకు మరోసారి చర్చనీయాంశంగా మారింది.. అనే వివరాలను పరిశీలిస్తే.. కేరళలో డ్యామ్ నిర్మాణం జరిగింది.. దాని అవసరం మాత్రం తమిళనాడుది.. అందుకే నిర్వహణ మొత్తం తమిళనాడు ప్రభుత్వమే చూస్తోంది.. 1895లో ఇడ్డిక్కి జిల్లాలో తేక్కడై ప్రాంతంలో ముల్లైపెరియార్ డ్యామ్ నిర్మాణం జరిగింది. బ్రిటిష్ పాలకుల హయాంలో జరిగిన ఈ నిర్మాణానికి 999 సంవత్సరాల లీజుతో ఒప్పందం కుదిరింది.. అయితే ఇప్పుడు ఈ డ్యామ్ కారణంగా మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ వివాదాల్లో చిక్కుకోవడానికి కారణం ఏమిటన్నది ఒకసారి చూద్దాం..

డ్యామ్ నిర్మాణం, నిర్వహణ విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. తమిళనాడు అవసరాల నిమిత్తం కేరళలో నిర్మించిన ఈ ముల్లైపెరియార్ డ్యామ్ సాధారణంగా మనం చూసిన రిజర్వాయర్లలో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే విధంగా కాకుండా డ్యామ్ లో ఓ నిర్ణీత ఎత్తుకు నీరు నిండిన తర్వాత డ్యామ్ ఎగువ వైపు నుంచి ఫ్లో ద్వారా యూ టర్న్ పద్దతిలో నీరు తమిళనాడుకు చేరుతుంది.. డ్యామ్ నీటి నిల్వ కెపాసిటీ 156 టీఎంసీలు అయితే1979లో ఈ ప్రాంతంలో భూకంపం కారణంగా డ్యామ్‌లో స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి.. దీంతో నీటి నిల్వ సామర్ధ్యాన్ని తగ్గించేశారు.. అలాగే 145 టీఎంసీల సామర్ధ్యం దాటితే బ్యాక్ వాటర్ కారణంగా కేరళలోని ఇడ్డిక్కి జిల్లాలోని చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతుంటాయి.. ఈ క్రమంలో డ్యామ్ లో నీటి సామర్ధ్యాన్ని కేరళ ప్రభుత్వం పెంచకుండా ఉండేలా చూసింది.. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కోర్టును ఆశ్రయించి సుప్రీం ఆదేశాలతో తిరిగి పూర్తి సామర్ధ్యంతో ఉండేలా ఆదేశాలు పొందింది..

అయితే కేరళ ప్రభుత్వం మాత్రం 145 మాత్రమే అనుమతిస్తోంది.. డ్యామ్ నిర్మాణం జరిగి 130 సంవత్సరాలు కావడం అలాగే గతంలో భూకంపం కారణంగా స్వల్పంగా పగుళ్లు ఏర్పడడం డ్యాం ప్రతిష్టతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో బ్యాంకు కూలిపోతుందన్న వాదనలను కేరళలో చాలామంది లేవనెత్తారు.. అదే జరిగితే కేరళలోని ఇడికి ప్రాంతంలో వందల గ్రామాలు నేటి ప్రవాహంలో కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు సందర్భాల్లో నిరసనలు కూడా జరిగాయి.. అయితే డ్యాం పున:ర్నిర్మాణం జరిగితే గత ఒప్పందం ప్రకారం.. నీటి సామర్థ్యం మరింత తగ్గించాలని కేరళ ప్రభుత్వం చూస్తోందని అదే జరిగితే తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఇక్కడి రైతులు రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి..

ప్రస్తుతం మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా సీక్వెల్ ఏంపురాన్‌లో ముల్లై పెరియార్ డ్యాం ప్రస్తావన ఉండడం డ్యామ్ నిర్మాణం జరగాలని సినిమాలో కొన్ని సీన్లు ఉండడంతో మళ్లీ తమిళనాడుకు అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి.. మోహన్‌లాల్ టార్గెట్‌గా నిరసనలు చేపడుతున్నారు.. అలాగే సినిమా నిర్మాణ సంస్థ అయిన గోకులం సంస్థ కార్యాలయాలు టార్గెట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.. ముల్లై పెరియార్ డ్యాం నిర్వహణ కార్యాలయాన్ని ముట్టడించి రైతులు ఆందోళనకు దిగారు.. శతాబ్దం క్రితం నిర్మాణమైన ఈ ముళ్ళై పెరియార్ రిజర్వాయర్ కేంద్రంగా దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తోంది.. అయితే.. వివాదం కాస్త సద్దుమణిగింది అనుకుంటుండగా ఈ సినిమా కారణంగా మరోసారి రచ్చ మొదలైంది.. సినిమా ప్రదర్శన కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ప్రజాసంఘాలు ఆశ్రయించగా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన సినిమాను నిలుపుదల చేయలేమని కోర్టు పేర్కొంది.. దీంతో పలువురు ఎంపురాన్ సినిమాని రీసెన్సార్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..