Ranya Rao: జైల్లో ఉన్న రన్యా రావుకు ఊహించని షాకిచ్చిన భర్త! దెబ్బ మీద దెబ్బ
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె భర్త జతిన్ హుక్కేరి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించబోతున్నాడు. పెళ్ళైన కొద్ది రోజులకే వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. రన్యా దుబాయ్‌కు తరచుగా వెళ్లడం, బంగారం అక్రమ రవాణా ఆరోపణలతో వారి మధ్య గొడవలు పెరిగాయి.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలులో ఉన్న నటి రన్యా రావుకు మరో షాక్ తగిలింది. ఆమె భర్త జతిన్ హుక్కేరి ఆమె నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివాహం అయినప్పటి నుండి, రన్యాతో ఏదో ఒక సమస్యను ఎదురవుతోందని, అందువల్ల, అతను విడాకులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా రన్యా రావుతో జతిన్ దూరంగా ఉన్నాడు. కాగా, అక్టోబర్ 6, 2024న బెంగళూరులోని బాస్టిన్ రెస్టారెంట్‌లో పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా రన్యా, జతిన్ కలుసుకున్నారు. వీరి నిశ్చితార్థం అక్టోబర్ 23, 2024న జరిగింది.
వివాహం నవంబర్ 27, 2024న తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. తరువాత, ఇద్దరు లావెల్లె రోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. కానీ, వివాహం జరిగిన ఒక నెలలోనే రన్యా, జతిన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలలకే రన్యా దుబాయ్ వెళ్లింది. రన్యా తరచుగా దుబాయ్‌కు వెళ్తుండటంపై జతిన్ గొడవ పడుతుండేవాడు. ఈ గొడవలు ప్రస్తుతం విడాకుల దశకు కూడా చేరుకున్నాయి. అయితే దుబాయ్ వెళ్లొద్దని జతిన్ ఎంత చెప్పినా రన్యా మాత్రం, తన స్నేహితుడు తరుణ్ తో కలిసి బంగారం అక్రమ రవాణా చేసేదని సమాచారం.
తాజాగా రన్యా దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె అరెస్టు తర్వాత, DRI అధికారులు ఆమె భర్త జతిన్ హుక్కేరిని కూడా ప్రశ్నించారు. తనను అరెస్టు చేస్తారేమో అని జతిన్ ముందుగానే హైకోర్టును ఆశ్రయించాడు. రన్యా రావుపై వచ్చిన ఆరోపణలతో జతిన్‌కు ఎలాంటి సంబంధం లేదని జతిన్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభులింగ నవదగి కోర్టుకు వెల్లడించారు. పెళ్లైన నెలలోపే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. ఈ కేసుతో పాటు, తమ మధ్య నెలకొన్న విభేదాల కారణంగా విడాకులు కావాలని జతిన్ కోరే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.