AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది దా సర్‌ప్రైజు.. జీతం రూ.15 వేలు.. కట్టాల్సిన ట్యాక్స్‌ రూ.34 కోట్లు! ఈ కార్మికుడి కథ తెలుసా?

ఆగ్రాకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కరణ్ కుమార్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.34 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసు జారీ చేసింది. నెలకు రూ.15,000 జీతం పొందే అతని పాన్ కార్డ్ దుర్వినియోగం చేసినట్లు అనుమానిస్తున్నారు. అతని గత యజమాని పాన్ కార్డును దుర్వినియోగం చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటన పాన్ కార్డ్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఇది దా సర్‌ప్రైజు.. జీతం రూ.15 వేలు.. కట్టాల్సిన ట్యాక్స్‌ రూ.34 కోట్లు! ఈ కార్మికుడి కథ తెలుసా?
Income Tax
SN Pasha
|

Updated on: Apr 02, 2025 | 2:14 PM

Share

అతనో పారిశుద్ధ్య కార్మికుడు.. నెలకు ఓ రూ.15 వేల జీతం అందుకుంటూ ఉంటాడు. కానీ, అతను ప్రభుత్వానికి బాకీ పడిన ట్యాక్స్‌ ఎంతో తెలుసా? తెలిస్తే అవునా నిజమా అంత కట్టాలా అంటూ ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఒక ఏడాడికి ఏకంగా రూ.34 కోట్లు పన్ను చెల్లించాల్సిందిగా ఆదాయపు పన్ను విభాగం అధికారులు ఓ పారిశుద్ధ్య కార్మికుడికి నోటీసులు జారీ చేశాడు. పేరుకి పారిశుద్ధ్య కార్మికుడే కానీ వేరే ఆస్తులు బాగా ఉండి ఉంటాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. అతనికి ఎలాంటి ఆస్తులు లేవు. మరి రూ.34 కోట్ల పన్ను కట్టమని ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇస్తుందని అనుకుంటున్నారా..? అయితే పూర్తి స్టోరీ తెలుసుకోండి.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన కరణ్‌ కుమార్‌ ఖైర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి నెలకు రూ.15 వేల జీతం వస్తుంది. దాంతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అతనికి ఓ నోటీసు వచ్చింది. ఆ నోటీసులో ఏముందో అతనికి అర్థం కాలేదు. కాస్త బాగా చదువు వచ్చిన వారికి అదేంటో అని చూపిస్తే.. వాళ్లు అందులో ఉన్న విషయం చదివి వినిపిస్తే.. కరణ్‌ కుమార్‌కు గుండె ఆగినంత పనైంది. ఆ తర్వాత కొద్ది సేపటికి వావ్‌ వాటే జోక్‌ అంటూ నవ్వుకున్నంత సీన్‌ క్రియేట్‌ అయింది.

ఆ నోటీసులో 2019-20 ఏడాదికి గాను రూ.34 కోట్ల పన్ను చెల్లించాల్సిందిగా కరణ్‌కుమార్‌ను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆదేశించింది. నెలకు రూ.15 వేలు సంపాదించే తాను రూ.34 కోట్ల పన్ను ఎలా కడతానంటూ కరణ్‌ కుమార్‌ ఆశ్చర్యపోయాడు. మరి కరణ్‌ కుమార్‌ పేరిట నోటీసులు ఎందుకు వచ్చాయి.. అంటే అతని పాన్‌ కార్డ్‌ దుర్వినియోగం అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కరణ్ కుమార్‌ గతంలో పనిచేసిన చోట తన యజమానికి తన పాన్‌ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. బహుషా అతను ఏమైనా ఇతని పాన్‌ కార్డు దుర్వినియోగం చేసి ఉంటాడా అని భావిస్తున్నారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ