Kerala Tiger attack: పులిని చంపాలని జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌.. హైకోర్టు మొట్టికాయలు

|

Dec 13, 2023 | 3:41 PM

కేరళలోని వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరిలో యువ రైతుపై దాడి చేసి చంపిన పులిని కాల్చిచంపాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు బుధవారం (డిసెంబర్‌ 13) తిరస్కరించింది. మనిషి ప్రాణనష్టాన్ని ఎలా భర్తీ చేయగలరంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రిప్యుటేషన్‌ కోసమే ఈ పిటిషన్‌ వేశారా అని ప్రశ్నించింది. ఫైరింగ్‌ ఆర్డర్‌ను పాటించలేదని పేర్కొంటూ..

Kerala Tiger attack: పులిని చంపాలని జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌.. హైకోర్టు మొట్టికాయలు
Kerala Tiger Attack
Follow us on

తిరువనంతపురం, డిసెంబర్‌ 12: కేరళలోని వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరిలో యువ రైతుపై దాడి చేసి చంపిన పులిని కాల్చిచంపాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు బుధవారం (డిసెంబర్‌ 13) తిరస్కరించింది. మనిషి ప్రాణనష్టాన్ని ఎలా భర్తీ చేయగలరంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రిప్యుటేషన్‌ కోసమే ఈ పిటిషన్‌ వేశారా అని ప్రశ్నించింది. ఫైరింగ్‌ ఆర్డర్‌ను పాటించలేదని పేర్కొంటూ పిటిషనర్‌కు కోర్టు రూ.25 వేల జరిమానా విధించింది.

కాగా గత వారం సుల్తాన్ బతేరి వాకేరిలో ప్రజీష్ అనే యువకుడిని పులి చంపింన సంగతి తెలిసిందే. పశువులను మేపేందుకు వెళ్లిన ప్రజీష్ సాయంత్రం వరకు కనిపించకపోవడంతో స్థానికులు అతని జాడ కోసం వెతకగా.. మృతదేహాన్ని పులి తిన్నట్లు గుర్తించారు. చాలా చోట్ల మృతుడి శరీర భాగాలు కనిపించాయి. పులిని గుర్తించేందుకు, ఏ ప్రదేశంలో పులి ఉందో తెలుసుకోవడానికి వివిధ ప్రాంతాల్లో 11 కెమెరాలను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. వీడియో ఫుటేజీ, పాదముద్రల ఆధారంగా శోధించే ప్రయత్నం చేస్తున్నారు. పులిని తొలుత సురక్షితంగా పట్టుకోవాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక వేళ ఇది విజయవంతం కాకపోతే, పులిని గన్‌తో షూట్‌ చేసి చంపవచ్చని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ మూడు బృందాలుగా ఏర్పడి పులి కోసం ముమ్మరంగా గాలిస్తోంది.

ప్రజీష్‌పై దాడి చేసి చంపిన ప్రదేశంలో గాలింపు సాగుతోంది. పులి ఎక్కువ దూరం వెళ్లలేదని వారి దర్యాప్తులో తేలింది. పులికి ఇంజక్షన్‌ ద్వారా బంధించేందుకు వెటర్నరీ బృందం సైతం ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉంది. పులిని మ్యాన్‌ ఈటర్‌గా ప్రకటించాలని, తక్షణమే ఆ పులిని చంపాలని, బాధిత కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, అటవీ సరిహద్దులో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా మృతుడి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని కోరుతూ నార్త్ సీసీఎఫ్‌కు నివేదిక అందజేశారు. దీంతో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పులిని చంపేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం విఫలమైతే కాల్చి చంపవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.