Delhi: కవిత కేసులో మరో మలుపు.. సీబీఐ విచారణపై కోర్టులో పిటిషన్..

ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణను వ్యతిరేకించారు. లిక్కర్ కేసులో అవినీతి కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో తనను తీహార్ జైలులోనే విచారించాలని ఢిల్లీ స్పెషల్ కోర్టును కోరింది సీబీఐ. శుక్రవారం సీబీఐకి ఢిల్లీలోని తిహార్ జైలుకే వెళ్లి విచారించాలని ఆదేశించింది కోర్టు.

Delhi: కవిత కేసులో మరో మలుపు.. సీబీఐ విచారణపై కోర్టులో పిటిషన్..
Mlc Kavita
Follow us
Srikar T

|

Updated on: Apr 06, 2024 | 3:39 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ విచారణను వ్యతిరేకించారు. ఈ కేసులో కవితను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సీబీఐ ఢిల్లీ స్పెషల్ కోర్టును కోరింది. అయితే దీనిపై స్పందించిన ఢిల్లీ స్పెషల్ కోర్టు.. తిహార్ జైలుకు వెళ్లి కవితను విచారించవచ్చని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనపై విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ శనివారం అదే ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు కవిత. అలాగే విచారణ నిమిత్తం తిహార్ జైలుకు వెళ్లిన సీబీఐ అధికారులకు కవిత సహకరించలేదు.

తీహార్‌ జైలులో కవితను విచారణ చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‎కు కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అవెన్యూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా ఇలా వాదించారు. ఆమెకు తెలియకుండా.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సిబిఐ న్యాయ ప్రక్రియను విఘాతం కల్గించిందని కోర్టుకు తెలిపారు. అలాగే కోర్టు నుండి అనుకూలమైన ఉత్తర్వులు పొందేందుకు సిబిఐ తన విచారణలో నిజమైన వాస్తవాలను బయటకు చేయకపోవచ్చని తాను అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.

కవిత తరఫు వాదనలు వినిపించే వరకు సీబీఐ విచారణకు ఇచ్చిన ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయమూర్తిని కోరారు. మార్చి 15న ఢిల్లీ కేసులో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తన 16 ఏళ్ల కొడుకు పరీక్షల నేపథ్యంలో ఆమెకు బెయిల్ అవసరమని, అందుకోసమే కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గురువారం కోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో కోర్టు శుక్రవారం సీబీఐకి ఇచ్చిన ఉత్తర్వులు తాత్కాలికంగా రద్దు చేస్తుందా.. లేక సోమవారం మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తుందా అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. సోమవారం ఉదయం 10.30కి కవితను కోర్టులో హారుపరచాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్