Karnataka: నాలుగో తరగతి విద్యార్థిని కొట్టి బిల్డింగ్ నుంచి తోసేసిన టీచర్.. బాలుడి తల్లిపై కూడా దాడి..

|

Dec 20, 2022 | 9:10 AM

కర్ణాటకలో దారుణం జరిగింది. విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉన్నత స్థాయికి చేరుకునేలా వారు తీర్చదిద్దవలసిన టీచరే వారి పాలిట యముడిగా మారాడు. కర్ణాటక గడగ్ జిల్లాలోని..

Karnataka: నాలుగో తరగతి విద్యార్థిని కొట్టి బిల్డింగ్ నుంచి తోసేసిన టీచర్.. బాలుడి తల్లిపై కూడా దాడి..
Karnataka 10years Old Student
Follow us on

కర్ణాటకలో దారుణం జరిగింది. విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉన్నత స్థాయికి చేరుకునేలా వారు తీర్చదిద్దవలసిన టీచరే వారి పాలిట యముడిగా మారాడు. కర్ణాటక గడగ్ జిల్లాలోని హడ్లీ ఆదర్శ్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ముత్తప్ప యల్లప హడగలి 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మరణానికి కారణమయ్యాడు. సోమవారం 10 సంవత్సరాల ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టి పాఠశాల మొదటి అంతస్తు బాల్కనీ నుంచి తోసివేయడంతో బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

అయితే ముత్తప్ప యల్లప కేవలం బాలుడిని చంపడమే కాక అదే పాఠశాలలో పనిచేస్తున్న ఆ పిల్లవాడి తల్లిపై కూడా దాడి చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోటీస్ శివప్రకాశ్ దేవరాజు తెలిపారు. ‘‘ బాలుడు మృతి చెందగా అతని తల్లికి తీవ్ర గాయలయ్యాయి. పాఠశాలలో పనిచేస్తున్న శివానంద్ పాటిల్‌కు కూడా స్వల్ప గాయాలవగా అతనిని ఆసుపత్రికి తరలించామ’’ని ఆయన అన్నారు.  

కాగా, బాలుడిని బాల్కనీ నుంచి తోసేసిన తర్వాత ముత్తప్ప పాఠశాల నుంచి పారిపోయాడు. అతనిపై పోలీసులు ఐపీసీ 302(హత్య) కింద కేసు నమోదు చేశారు. ‘‘ ఈ ఘటన ఎలా జరిగిందో స్పష్టం తెలుస్తోంది కానీ ముత్తప్ప ఉద్దేశ్యం ఏమిటో ఇంకా తెలియలేదు. ఒకటి,  రెండు రోజులలో మరింత సమాచారాన్ని తెలుసుకుంటాము’’ అని దేవరాజు అన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రై వార్తల కోసం క్లిక్‌ చేయండి..