Viral: రెండేళ్ల చిన్నారికి విపరీతమైన కడుపు నొప్పి.. డాక్టర్లు ఎక్స్‌రే చూడగా.. 20 నిమిషాల్లో!
ప్రతీ రోజూ ఎన్నో వింత కేసులను డాక్టర్లు చెక్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. సాధారణంగా చిన్న పిల్లలు..
ప్రతీ రోజూ ఎన్నో వింత కేసులను డాక్టర్లు చెక్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. సాధారణంగా చిన్న పిల్లలు తెలిసీ తెలియకుండా నాణేలు, బ్యాటరీలు లాంటివి నోట్లో పెట్టుకుని మింగేస్తుంటారు. ఈ కేసు కూడా అలాంటిదే. కేరళలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన రెండేళ్ల చిన్నారి ప్రాణాలను సకాలంలో డాక్టర్లు స్పందించి కాపాడారు. కేరళలోని తిరువనంతపురం నగర శివారులో నివాసముంటున్న రెండేళ్ల చిన్నారి రిషికేశ్ పొరపాటున టీవీ రిమోట్‌లోని బ్యాటరీని మింగేశాడు. అతడి తల్లిదండ్రులు వెంటనే దాన్ని గమనించి ఇంటి సమీపంలో ఉన్న నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి కడుపునొప్పి విపరీతంగా ఉండటం.. అలాగే అసలు విషయాన్ని సైతం తెలుసుకున్న డాక్టర్లు అప్రమత్తమై.. చిన్నారికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్‌కి తరలించారు. కేవలం 20 నిమిషాల్లోనే ఎండోస్కోపీ ద్వారా బాలుడి కడుపులోని బ్యాటరీని బయటికి తీశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు.. ఆ బ్యాటరీ కడుపులో కాకుండా ఇంకెక్కడైనా ఇరుక్కుని ఉంటే చికిత్స చేయడం కష్టమయ్యేదని వివరించారు. కాగా, బాలుడు మింగిన బ్యాటరీ ఐదు సెంటీమీటర్ల పొడవు ఉందని పేర్కొన్నారు.