AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంట విషయంలో గొడవ.. భార్యను అత్యంత పాశవికంగా హతమార్చిన భర్త!

సంసారం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. అవి వస్తుంటాయి.. పోతుంటాయి. అలాంటి వాటికి ఏదేదో జరిగిపోతుందని ఊహించుకుంటే.. అనర్ధం ఖాయం. క్షణికావేశం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెంగళూరు దక్షిణ జిల్లా మాగడి తాలూకా మట్టికెరెలో వంట విషయంలో గొడవపడి తన భార్యను తురుము పీటతో కొట్టి చంపాడు ఓ భర్త. తిమ్మమ్మ (65)ను ఆమె భర్త రంగయ్య(68) హత్య చేశాడు

వంట విషయంలో గొడవ.. భార్యను అత్యంత పాశవికంగా హతమార్చిన భర్త!
Wifemurder
Balaraju Goud
|

Updated on: Jun 27, 2025 | 11:39 AM

Share

సంసారం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. అవి వస్తుంటాయి.. పోతుంటాయి. అలాంటి వాటికి ఏదేదో జరిగిపోతుందని ఊహించుకుంటే.. అనర్ధం ఖాయం. క్షణికావేశం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెంగళూరు దక్షిణ జిల్లా మాగడి తాలూకా మట్టికెరెలో వంట విషయంలో గొడవపడి తన భార్యను తురుము పీటతో కొట్టి చంపాడు ఓ భర్త. తిమ్మమ్మ (65)ను ఆమె భర్త రంగయ్య(68) హత్య చేశాడు. హత్య తర్వాత తిరుపతికి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాగడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని మత్తికెరె గ్రామంలో 65 ఏళ్ల తిమ్మమ్మను, ఆమె భర్త రంగయ్య (68) అతి దారుణంగా నరికి చంపేశాడు. బుధవారం(జూన్ 24) రాత్రి నచ్చని వంట చేయలేదని భర్తతో తీవ్రంగా గొడవ పడ్డాడు. దీంతో ఆవేశానికి లోనైన రంగయ్య వంటగదిలోని కొబ్బరి తురిమే పీటతో భార్య తిమ్మమ్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తిమ్మమ్మ మరణించిందని తెలిసి, రంగయ్య పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే గురువారం(జూన్ 27) ఉదయం తిరుపతికి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న రంగయ్యను రామనగరలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భార్య ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..