AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడి మోజులో కన్న కొడుకునే చంపించిన తల్లి.. కన్నడ జెండాతో గొంతు బిగించి దారుణం..!

కన్న ప్రేమను మరిచింది.. ప్రియుడి మోజులో పడి కడుపున పుట్టిన కొడుకునే కిరాతకంగా హత్య చేయించింది. తన వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా మారుతున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. కన్నడ రాజ్యోత్సవం రోజున జరిగిన ఈ దారుణ హత్యోదంతం కర్ణాటకలోని బెలగావిలో వెలుగుచూసింది. ఈ కేసులో తల్లితో పాటు ఆమె ప్రియుడు, మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రియుడి మోజులో కన్న కొడుకునే చంపించిన తల్లి.. కన్నడ జెండాతో గొంతు బిగించి దారుణం..!
Murder Own Son
Balaraju Goud
|

Updated on: Nov 12, 2026 | 12:35 PM

Share

కన్న ప్రేమను మరిచింది.. ప్రియుడి మోజులో పడి కడుపున పుట్టిన కొడుకునే కిరాతకంగా హత్య చేయించింది. తన వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా మారుతున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. కన్నడ రాజ్యోత్సవం రోజున జరిగిన ఈ దారుణ హత్యోదంతం కర్ణాటకలోని బెలగావిలో వెలుగుచూసింది. ఈ కేసులో తల్లితో పాటు ఆమె ప్రియుడు, మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరులోని ఆర్‌టీనగర్‌కు చెందిన మీనా ఓ బ్యూటీ పార్లర్‌లో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన రాకేష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. రాకేష్‌ను తన వద్ద కారు డ్రైవర్‌గా కూడా నియమించుకుంది. అయితే వీరిద్దరి మధ్య కొనసాగుతున్న సంబంధాన్ని మీనా కుమారుడు విజయ్ నారాయణ్ (24) గుర్తించి అభ్యంతరం తెలిపాడు. దీంతో తమ సంబంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లీప్రియుడు అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.

పథకం ప్రకారం నవంబర్ 1వ తేదీన కన్నడ రాజ్యోత్సవ వేడుకలు చూపిస్తానంటూ విజయ్‌ను రాకేష్ బెలగావికి తీసుకెళ్లాడు. అక్కడ తనకు పరిచయమున్న సచిన్, మనోజ్, తమన్న, ఏకనాథ్‌ల సహాయంతో హత్యకు పాల్పడ్డాడు. కన్నడ జెండాతో విజయ్ గొంతు బిగించి ప్రాణాలు తీశారు. అనంతరం హైవే పక్కన నిర్జన ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాకేష్ తిరిగి బెంగళూరుకు చేరుకోగా, మీనా కూడా అక్కడే ఉంటూ కుమారుడి హత్యకు సంబంధించిన పరిణామాలను గమనించింది.

మరోవైపు రహదారి పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించడంతో కీలక ఆధారాలు లభించాయి. మాళమారుతి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.ఆర్. గడ్డేకర్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. మీనాపై అనుమానం రావడంతో ఆమెతో పాటు విజయ్, రాకేష్‌ల కాల్ వివరాలను పోలీసులు విశ్లేషించారు.

లోతుగా విచారించడంతో తల్లి మీనా తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో మీనా, రాకేష్‌తో పాటు అతడి స్నేహితులు సచిన్, మనోజ్, తమన్న, ఏకనాథ్‌లను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్న కొడుకునే హత్య చేయించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us