మరణించాడనుకున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడు, కర్ణాటకలో ఇదో విచిత్రం
కర్ణాటకలో విచిత్రం జరిగింది. మరణించాడనుకున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడు. బెళగావి లో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. 27 ఏళ్ళ ఓ వ్యక్తి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా.........
కర్ణాటకలో విచిత్రం జరిగింది. మరణించాడనుకున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడు. బెళగావి లో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. 27 ఏళ్ళ ఓ వ్యక్తి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచారు. చివరకు అతడు మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఇక పోస్ట్ మార్టం కోసం అతడి దేహాన్ని తరలించారు. పోస్ట్ మార్టం చేయబోతున్న డాక్టర్ అతడి దేహాన్ని ముట్టుకోగానే నాడి బలహీనంగా కొట్టుకోవడాన్ని గమనించారు. దాంతో నిర్ఘాంత పోయి ఆయన వెంటనే ఈ విషయాన్నీ ఇతర వైద్యులకు తెలియజేశారు. వారు కూడా వచ్చి అతడు సజీవంగా ఉన్నాడని తెలిసి తక్షణమే మళ్ళీ ఆసుపత్రికి తరలించారు. ఈ లోగా ఆ యువకుడి బంధువులు అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. చివరకు అతడు బతికే అవకాశం ఉందని తెల్సింది. ఆ యువకుడి బంధువుల ఆనందానికి అంతు లేకుండా పోయింది.
కాగా ఈ ఘటనపై పోలీసులు తమకు తాముగా దర్యాప్తు చేసినప్పటికీ ఎవరూ వారికి ఫిర్యాదు చేయలేదు. కర్ణాటకలో ఈ ఉదంతం అందరికీ ఆశ్చర్యం కల్గించింది. చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా ఉండడం మిరకిల్ అని అభివర్ణిస్తున్నారు . ప్రస్తుతం ఆ యువకుడి చికిత్స శరవేగంగా సాగుతోంది. డాక్టర్లు కూడా తమ పొరబాటుకు తామే చింతిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
Jerbara Flowers : ఈ పూలతో లక్షల్లో లాభాలు.. మొక్కకు 25 పెడితే.. ఒక్కో పువ్వు ఎంత పలుకుతుందో తెలుసా..
బంపర్ ఆఫర్ కోట్టెసిన బిగ్బాస్ బోల్డ్ బ్యూటీ.. మెగా హీరో సినిమాలో ఛాన్స్.. ఎంతకీ ఏ పాత్రంటే..