IT Raids In Bollywood: బాలీవుడ్‌పై కొనసాగుతున్న ఐటీ దాడులు… ఇంతకీ ఆ ఏడు బ్యాంక్ లాకర్లో ఏముంది..?
IT Raids In Bollywood: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నటి తాప్సీతో పాటు అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, మధు మంతెన సహా పలువురు ప్రముఖుల ఇళ్లతో పాటు...
IT Raids In Bollywood: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నటి తాప్సీతో పాటు అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, మధు మంతెన సహా పలువురు ప్రముఖుల ఇళ్లతో పాటు కార్యలయాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అనురాగ్ కశ్యప్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఫాంటమ్ సంస్థ లక్ష్యంగా ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాల్లో అనేక అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముంబై, పుణె, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 28 ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యలయాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. వాస్తవ సినిమా బాక్సాఫీస్ వసూళ్లతో పోల్చితే.. సంస్థ ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దాదాపు రూ.300 కోట్ల తేడా ఉన్నట్లు కనుగొన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో తాప్సీకి చెందిన రూ.5 కోట్ల నగదు రసీదులు వసూలు చేసుకున్నారు. అంతేకాకుండా భారీ మొత్తంలో డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఐటీ సోదాల్లో అధికారులు ఏడు బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిని తెరవడానికి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ లాకర్లలో ఏముందన్నదానిపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తినెలకొంది. ఇదిలా ఉంటే.. ఈ మొత్తం ఐటీ దాడులకు ఫాంటమ్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ సంస్థ కారణమని అధికారులు గుర్తించారు. ఫాంటమ్ ప్రొడక్షన్ సంస్థ రూ. 300 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: మరణించాడనుకున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడు, కర్ణాటకలో ఇదో విచిత్రం