సైనిక పాలనకు బెదిరి, భారత్ చేరిన 19 మంది మయన్మార్ పోలీసులు, మిజోరం లో కలకలం

మయన్మార్ లో సైనిక పాలకుల ఆదేశాలు పాటించలేక  ఆ దేశానికి చెందిన 19 మంది పోలీసులు పారిపోయి భారత దేశానికి చేరుకున్నారు. ఇండియాకు తాము శరణార్థులుగా వచ్చామని చెబుతన్నారు. వీరు మయన్మార్ నుంచి  మిజోరంలోని చాంపెయి, సెర్చిస్ జిల్లాలకు.....

సైనిక పాలనకు బెదిరి, భారత్ చేరిన 19 మంది మయన్మార్ పోలీసులు, మిజోరం లో కలకలం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 04, 2021 | 7:53 PM

మయన్మార్ లో సైనిక పాలకుల ఆదేశాలు పాటించలేక  ఆ దేశానికి చెందిన 19 మంది పోలీసులు పారిపోయి భారత దేశానికి చేరుకున్నారు. ఇండియాకు తాము శరణార్థులుగా వచ్చామని చెబుతన్నారు. వీరు మయన్మార్ నుంచి  మిజోరంలోని చాంపెయి, సెర్చిస్ జిల్లాలకు చేరారని, మరింతమంది పోలీసులు కూడా ఇక్కడికి వచ్ఛే సూచనలు కనబడుతున్నాయని మిజోరం అధికారులు తెలిపారు. ఈ పోలీసుల్లో చాలామంది  కింది స్థాయి వారేనని, వారి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని ఆ అధికారులు వెల్లడించారు. మయన్మార్ లో మిలిటరీ పాలకుల వేధింపుల  కారణంగా అక్కడి పోలీసులు కూడా సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నారని సోషల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి.కొంతమంది పోలీసులను సైనికాధికారులు అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది.

ఏమైనా…. ఆ దేశం నుంచి పోలీసులు ఇలా ఇండియాకు చేరుకోవడం ఇదే మొదటిసారి. తాము సైనిక పాలకుల ఆదేశాలను పాటించనందున  తీవ్రంగా  శిక్షిస్తారన్న భయంతో పారిపోయి వచ్చామని. తమను  ఇండియా శరణార్థులుగా పరిగణించి ఆశ్రయం ఇవ్వాలని వీరు కోరుతున్నట్టు అధికారులు తెలిపారు. మయన్మార్ లో ఇప్పటికే సైన్యం, పోలీసుల కాల్పుల్లో సుమారు 40 మంది మృతి చెందారని, అనేకమంది గాయపడ్డారని ఐరాసకు చెందిన ఓ దౌత్య ప్రతినిధి తెలిపారు. ఫిబ్రవరి 1 న ఆ దేశంలో ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని సైనిక పాలకులు అదుపులోకి తీసుకుని,,దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుధ్ధ రించాలని వేలాది ప్రజలు వీధుల్లోకి వఛ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు వీరిని చెదరగొట్టేందుకు సైన్యం, పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరుపుతున్నారు. అటు- .పలు దేశాలు ఇప్పటికే  మయన్మార్ పై ఆంక్షలు విధించాయి.   ఐరాస సైతం మయన్మార్ పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆంగ్ సాన్ సూకీకి వెంటనే తిరిగి అధికారం అప్పగించాలని కోరుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తు పట్టగలరా.! బుమ్రా పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనట.?

Boxer MaryKom : బాక్సింగ్‌లో భారత్‌కి మరో పతకం ఖాయం.. బాక్సమ్‌ ఓపెన్‌ టోర్నీలో సెమీస్‌కి దూసుకెళ్లిన మేరీకోమ్‌