కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట.. కిట్ విడుదల చేసిన కర్ణాటక ప్రభుత్వం
కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎనిమిది వస్తువులతో కూడిన ఓ సెట్‌ను విడుదల చేసింది.
Karnataka Corona updates: కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎనిమిది వస్తువులతో కూడిన ఓ సెట్‌ను విడుదల చేసింది. కర్ణాటక డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వత్‌నారాయణ్ ఈ సెట్‌ని విడుదల చేశారు. అందులో ఇమ్యూనిటీ బూస్టర్ చపాతి, టీ, డైలీ డ్రాప్స్, చూయింగ్‌గమ్ లాంటి ఒక ట్యాబ్లెట్, హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, వెజ్ శానిటైజర్, వాటర్ శానిటైజింగ్ సిస్టమ్, యాంటీ-మైక్రోబియల్ ఎయిర్ శానిటైజింగ్ సిస్టమ్ ఉన్నాయి. వీటిని బెంగళూరు బయోఇన్నోవేషన్ సెంటర్‌లో ఆయన విడుదల చేశారు. కాగా కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 1,51,449కు చేరింది. అందులో 73,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుమార్తెకు సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే.
Read This Story Also: హీరోలతో ‘కాంప్రమైజ్’ అవ్వకపోవడం వలనే: రవీనా టాండెన్ ఆరోపణలు