రామ మందిర భూమి పూజను వీక్షించిన మరో 15 దేశాలు..!
అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. అయోధ్యలో జరిగిన రామ జన్మభూమి భూమి పూజని భారత్‌లోని అశేష
అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. అయోధ్యలో జరిగిన రామ జన్మభూమి భూమి పూజని భారత్‌లోని అశేష ప్రజానీకం చూసిన విషయం విదితమే. అయితే, కేవలం మన దేశంలో కాకుండా, మరో 15 దేశాల ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్, ఓమన్, కువైట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, శ్రీలంక పాటు మరిన్ని దేశాల ప్రజలు ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల్లో వీక్షించారు.
వివరాల్లోకెళితే.. భారత్ లోనే దాదాపు 200 మీడియా సంస్థలు ఈ కార్యక్రమాన్ని లైవ్ తీసుకున్నట్లు దూరదర్శన్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలు ఏఎన్‌ఐ ద్వారా ఇతర ఛానెల్స్‌కు డిస్టిబ్యూట్ చేశారు. ఏఎన్‌ఐ ద్వారా సుమారు 1200 స్టేషన్లకు పంపిణీ చేయగా, ఏపీటీఎన్ (అసోసియేటెడ్ ప్రెస్ టెలివిజన్ న్యూస్) ద్వారా మరో 450 మీడియా సంస్థలకు పంపిణీ చేశారు. డీడీ న్యూస్ మాత్రం ప్రత్యేకంగా ఏసియా పసిఫిక్ దేశాలతో ఈ కార్యక్రమాన్ని పంచుకుంది.
Read More:
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!