Karnataka Elections: కర్నాటకలో బజరంగ్‌బలి పాలిటిక్స్‌.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు..

కర్ణాటక రాజకీయాలు హాట్‌ హాట్‌గా ఉన్నాయి. పోలింగ్‌ డేట్‌ దగ్గర పడేకొద్దీ..కర్ణాటక రాజకీయం మొత్తం దేవుడి చుట్టూ తిరుగుతోంది.. బజరంగ్‌బలి వ్యవహారంపై బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్దం నడుస్తోంది. కర్నాటకలో బజరంగ్‌బలి పాలిటిక్స్‌ మరింత ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంలో బజరంగ్‌బలి నినాదాన్ని హోరెత్తించగా..

Karnataka Elections: కర్నాటకలో బజరంగ్‌బలి పాలిటిక్స్‌.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు..
Bjp Vs Congress

Edited By: Ravi Kiran

Updated on: May 05, 2023 | 10:45 AM

కర్ణాటక రాజకీయాలు హాట్‌ హాట్‌గా ఉన్నాయి. పోలింగ్‌ డేట్‌ దగ్గర పడేకొద్దీ..కర్ణాటక రాజకీయం మొత్తం దేవుడి చుట్టూ తిరుగుతోంది.. బజరంగ్‌బలి వ్యవహారంపై బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్దం నడుస్తోంది. కర్నాటకలో బజరంగ్‌బలి పాలిటిక్స్‌ మరింత ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంలో బజరంగ్‌బలి నినాదాన్ని హోరెత్తించగా.. కాంగ్రెస్‌ కూడా కౌంటర్‌ మొదలుపెట్టింది. బజరంగ్‌దళ్‌ను బ్యాన్‌ చేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టారని బీజేపీ ఆందోళనలు చేస్తుండగా పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాట మేనిఫెస్టోలో లేదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి కౌంటర్‌గా డీకే కొత్త నినాదం ఎత్తుకుని మైసూర్‌లో హనుమాన్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు డీకే శివకుమార్‌.

హనుమంతుడు కర్నాటక ప్రజల ఆరాధ్యదైవమన్నారు డీకే శివకుమార్‌. బీజేపీ ప్రభుత్వం ఆంజనేయుడి ఆలయాల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్‌ ఆలయాలను నిర్మిస్తామన్నారు. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేస్తామన్నారు.

వీరప్పమొయిలీ కీలక వ్యాఖ్యలు..

బజరంగ్‌దళ్‌ వ్యవహారంపై కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్పమొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న శ్రీరామసేనపై అప్పటి గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ నిషేధం విధించారని అన్నారు. బీజేపీ ఎంతగానో ప్రేమించే వల్లభాయ్‌ పటేల్‌ ఆర్ఎస్ఎస్‌పై బ్యాన్‌ విధిస్తే నెహ్రూ ఎత్తేశారని అన్నారు మొయిలీ. హద్దులు మీరితే ఏ సంస్థపైనా అయినా బ్యాన్‌ విధించే అధికారం రాజ్యాంగం ఇచ్చిందన్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా బీజేపీ, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. హనుమాన్‌ చాలీసాను పఠించారు. హనుమాన్‌ ఆలయాల్లో పూజలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..