Karnataka Elections 2023: ప్రజలే మోడీని దేవుడిలా చూస్తారు.. సిద్ధరామయ్యకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్..

|

Apr 20, 2023 | 1:22 PM

కర్ణాటక రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ఖండించారు

Karnataka Elections 2023: ప్రజలే మోడీని దేవుడిలా చూస్తారు.. సిద్ధరామయ్యకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్..
Karnataka Politics
Follow us on

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీల నాయకులు.. అంతే ఘాటుగా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల తరుణంలో రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ఖండించారు. కర్ణాటకలోని షిగ్గావ్‌లో జరిగిన బహిరంగ సభలో కాషాయ పార్టీ అధినేత ప్రసంగించారు. కర్ణాటక రాష్ట్రంపై ప్రధాని మోడీ ఆశీస్సులు ఉన్నాయని.. పేర్కొన్నారు. నడ్డా వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘కర్ణాటకను నరేంద్రమోడీ ఆశీర్వదిస్తారని జేపీ నడ్డా చేసిన ప్రకటనను ఖండిస్తున్నాను.. ఇది చూస్తుంటే అతనికి ప్రజాస్వామ్యం గురించి పాఠాలు నేర్పాల్సిన అవసరం అనిపిస్తోంది” అంటూ ట్వీట్ చేశారు. ‘‘రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలు సమానం.. ఒకే హక్కులను కలిగి ఉంటాయి. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి చోటు లేదు. ప్రజాస్వామ్యంలో అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు నిర్ణయిస్తారు.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారికి సేవ చేస్తారు.. పీఎం మోడీ ఆశీర్వదించడానికి దేవుడేం కాదు” అంటూ పేర్కొన్నారు.

కాగా, సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ దేవుడని మేం చెప్పడం లేదు, ప్రజలు ఆయనను దేవుడిలా చూస్తారంటూ పేర్కొన్నారు. మోదీకి వ్యతిరేకంగా వారు (కాంగ్రెస్) ఏం మాట్లాడినా ప్రజలు తగిన సమాధానం చెప్తారు అంటూ.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ కర్ణాటకను నిర్లక్ష్యం చేశారని, జేపీ నడ్డా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారంటూ సిద్ధరామయ్య గురువారం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా మళ్లీ అధికారంలోకి వస్తుందని వివరించారు.

కాగా.. 224 సీట్లున్న అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..